వాల్తేరులో ఫైనల్ షెడ్యూల్.. సుమంత్ మూవీ అప్డేట్
ప్రస్తుతం సుమంత్ దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. అసలే చాలా ఏళ్ల తరువాత మళ్లీ రావా సినిమాతో ఓ హిట్ కొట్టి ఫాంలోకి వచ్చాడు. అయితే ఆ హిట్‌ను మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు. రాకరాక మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కపటధారి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సేఫ్‌గా ఉంటుంది కదా? అని కన్నడ రీమేక్‌ను ఎంచుకుంటూ అది కూడా సుమంత్‌ను నిండా ముంచేసింది.
కపటధారి సినిమా కనీసం యాభై లక్షల షేర్‌ను కూడా సాధించలేక చతికిలపడింది. ఎంతో కష్టపడి ఎంతో ప్రమోషన్స్ చేసినా కూడా కనీస వసూళ్లను కూడా రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలింది. అయితే సుమంత్ మాత్రం మరో ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వదిలిని పోస్టర్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. అనగనగా ఓ రౌడీ అనే సినిమాలో సుమంత్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

అనగనగా ఓ రౌడీ సినిమాను కార్తీకదీపం వంటలక్క నిర్మిస్తోంది. అందుకే ఈ చిత్రంపై మరింత ఆసక్తిని ఏర్పడింది. అయితే ఇందులో సుమంత్ వాల్తేరు రౌడీగా నటించబోతోన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ జరుగుతోందని అది కూడా వాల్తేరులో ప్రారంభమైందని సుమంత్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











