రౌడీలా మారిపోయిన అక్కినేని హీరో: సరికొత్త లుక్‌తో భయపెడుతున్నాడుగా

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన వారిలో సుమంత్ ఒకడు. 'ప్రేమకథ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటరైన అతడు.. సుదీర్ఘ కాలంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ, అతడు భారీ స్థాయిలో హిట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. అతడి సుదీర్ఘమైన కెరీర్‌లో 'సత్యం' పెద్ద హిట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత 'గౌరీ' కూడా ఆ రేంజ్‌లో ఆడింది. వీటి తర్వాత అంతగా కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు లేవు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం యాక్టర్‌గా అతడిని ఎక్కడికో తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఇటీవల పంథాను మార్చుకున్న సుమంత్ వైవిధ్యమైన కథలతో వస్తున్నాడు.

ప్రస్తుతం సుమంత్ 'కపటధారి' అనే సినిమా చేశాడు. కన్నడంలో సూపర్ హిట్ అయిన 'కవలుదారి'కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించాడు. ఇందులో హీరోయిన్‌గా నందితా శ్వేత నటిస్తోంది. క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ధనుంజయ్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ఈ చిత్ర టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sumanth Anaganaga Oka Rowdy First Look Released

నేడు సుమంత పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని తన కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ చిత్రానికి 'అనగనగా ఒక రౌడీ' అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో వాల్తేరు శీనుగా సరికొత్త లుక్‌తో భయపెడుతున్నాడు సుమంత్. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X