మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి.. హీరోయిన్‌తో రిలేషన్‌పై ట్విస్ట్ ఇచ్చిన సుమంత్
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్, ఎఫైర్ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. వీటిలో ఏది నిజమో? ఏది అబద్ధమో ఆ స్టార్స్ స్పందించే వరకు కూడా తెలియదు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ - స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు కలకలం రేపాయి. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలోనే సుమంత్‌ను మృణాల్ రెండో పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో విస్త్రతంగా వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం సుమంత్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..
వరుస ప్లాప్స్‌తో కెరీర్ డౌన్‌ఫాల్
అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ .. ప్రేమకథ సినిమాతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాత, మేనమామల గ్లామర్ పుణికి పుచ్చుకున్న సుమంత్ రొమాంటిక్ హీరోగా, లవర్‌బాయ్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. వరుస హిట్స్‌తో దూసుకొచ్చిన సుమంత్ ఆ తర్వాత ఎందుకో ఆ జోరు కొనసాగించలేకపోయాడు. ఫ్లాప్స్, కథల ఎంపికలో పొరపాట్లతో ఆయన కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది.

కీర్తి రెడ్డితో ప్రేమ, విడాకులు
తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డితో ప్రేమలో పడిన సుమంత్ ఆమెను పెద్దల అంగీకారంతో పెళ్లాడారు. అయితే కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ స్టార్‌డమ్ అందుకోలేకపోయారు సుమంత్. ఇటీవల సీతారామంలో తళుక్కున మెరిసిన ఆయన తిరిగి పునర్వైభవాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు
సీతారామంలో కలిసి నటించిన సుమంత్ - మృణాల్
ఇదే సీతారామం సినిమాతో తెలుగువారిని పలకరించిన మృణాల్ ఠాకూర్ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు మృణాల్. ఈ క్రమంలో సుమంత్‌తో ఆమె ప్రేమలో పడ్డారని.. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సుమంత్ - మృణాల్‌లు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం ఈ కథనాలకు బలం చేకూర్చినట్లయ్యింది.
ఫోటో దిగితే లింక్ పెట్టేస్తారా
తాజాగా మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి వార్తలపై సుమంత్ స్పందించారు. ఆయన రీసెంట్ మూవీ అనగనగా మే 15 నుంచి ఓటీటీలో నేరుగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సుమంత్ తన రెండో పెళ్లి, మృణాల్‌తో రిలేషన్‌పై స్పందించారు. మృణాల్‌తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని, ఓ సినిమా సమయంలో తీసుకున్న ఫోటోను పెట్టి తమ బంధంపై పుకార్లు సృష్టిస్తున్నారని సుమంత్ మండిపడ్డారు. మృణాల్‌ను తాను కలిసి చాలా కాలం అవుతోందని క్లారిటీ ఇచ్చారు.
సోలో లైఫే సో బెటర్
పెళ్లిపై తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని, సోలో లైఫే సో బెటర్ అంటూ సుమంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నానని.. ఖాళీ దొరికితే కుక్కలు, హోం థియేటర్, కొద్దిపాటి ఫ్రెండ్స్.. ఇదే నా ప్రపంచమని ఆయన వెల్లడించారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలని సుమంత్ సూచించారు. ఆయన క్లారిటీతో మృణాల్‌తో పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











