Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షూటింగ్ గ్యాప్‌లో అలా.. ‘విరించి’పై హీరో సుమంత్
అక్కినేని హీరో సుమంత్ ఈ మధ్యే కపటధారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కన్నడలో విజయం సాధించిన సినిమాను ఇక్కడ కపటధారిగా రీమేక్ చేశాడు. కానీ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఇప్పుడు అనగనగా ఓ రౌడీ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే వదిలిన పోస్టర్, సుమంత్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇప్పుడు సుమంత ఫైనల్ షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు. అయినా కూడా ఓ మూవీ ప్రమోషన్స్ కోసం తన సమయాన్ని కేటాయించాడు. కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్కంద మిత్ర హీరోగా సత్య కె దర్శకత్వంలో తెరకెక్కిన ఇండిపెండెంట్ ఫిలిం 'విరించి'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సత్య.కే, దామిని, స్కంధమిత్ర కథను అందించగా షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
విరించి ట్రైలర్‌ను సుమంత్ రిలీజ్ చేస్తూ.. విరించి సినిమా ట్రైలర్ చాల బాగుంది. దర్శకుడు సత్య ప్రతిభ ఈ ట్రైలర్‌తో తెలిసిపోతుంది.. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. హీరో స్కంద మిత్ర అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి.. అందరు ఈ సినిమా ని షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో చూసి ఆనందించండి అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.