twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టుగా ఓటీటీలోకి అక్కినేని హీరో సినిమా: ఎందులో రిలీజ్ కాబోతుందంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అందులో కొంత మంది మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకుని హవాను చూపిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మనవడు సుమంత్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ, చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో సుమంత్ ఇప్పటికీ భారీ హిట్ కోసం తహతహలాడుతూనే ఉన్నాడు.

    ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

    'ప్రేమకథ' అనే లవ్ స్టోరీతో మొదలైన సుమంత్ సినీ ప్రయాణంలో ఎక్కువగా లవ్ స్టోరీ మూవీలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక, ఇటీవల పూర్తిగా పంథాను మార్చి వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్నాడు. ఇందులో భాగంగానే కొంత కాలంగా డిఫరెంట్ జోనర్లను కూడా ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సుమంత్ 'మళ్లీ మొదలైంది' అంటూ అనే సినిమాను చేస్తున్నాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిందన్న విషయం తెలిసిందే.

    విడాకుల తర్వాత జీవితం అనే కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'మళ్లీ మొదలైంది' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనివార్య కారణాలతో ఇది పలుమార్లు ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేశారని తెలుస్తోంది. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించడంతో పాటు వాటిని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలా అతి త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు వీడియాకు వెల్లడించారు.

    పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

    Sumanths Malli Modalaindi Movie Release on ZEE5

    ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా భారీ చిత్రాలు వాయిదా పడిపోయాయి. చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుమంత్ నటిస్తోన్న 'మళ్లీ మొదలైంది' సినిమా విషయంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేసిందని తెలిసింది. ఇందుకోసం సందరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించిందని సమాచారం.

    సుమంత్ 'మళ్లీ మొదలైంది' మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. అంతేకాదు, దీన్ని ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని రకాల అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

    English summary
    Tollywood Senior Hero Sumanth Now Doing Malli Modalaindi Movie Under TG Keerthi Kumar Direction. This Movie Will Release on ZEE5 Directly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X