Aham Reboot సుమంత్ మూవీ ఫస్ట్‌లుక్ అదుర్స్.. యూనిట్‌పై విజయేంద్రప్రసాద్ ప్రశంసల వర్షం
సుమంత్ హీరోగా నటిస్తున్న అహాం రీబూట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత, బహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, S ఒరిజినల్స్ సంయుక్తంగా రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పోస్టర్‌లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేయడం క్రేజీ అంశంగా మారింది. ఈ పోస్టర్ వివరాల్లోకి వెళితే..
సుమంత్ చెవులకు హెడ్‌ఫోన్ పెట్టుకొని సీరియస్ లుక్స్‌తో ఉండగా.. ముఖంపై ఒకవైపు రెడ్ లైట్ పడుతుండగా.. హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. సుమంత్ లుక్‌కు తగినట్టుగా ఈ సినిమా కాన్సెప్ట్ మూవీ అనే భావన కలిగించింది.

అహం రీబూట్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ఈ కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్‌గా కూడా అనిపించింది. ఇలాంటి కథలకు ప్రేక్షకలు నుంచి మంచి డిమాండ్ ఉంది.
సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న సుమంత్‌కు అభినందనలు. నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు దర్శకుడు ప్రశాంత్ సాగర్‌కు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్ అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. అహాం రీ బూట్ ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతున్నాం. సుమంత్ నటన చాలా హైలెట్‌గా ఉంటుంది. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఉత్సుకత మా టీంలో ఉంది అని అన్నారు..
నిర్మాత రఘువీర్ గోరిపర్తి మాట్లాడుతూ.. అహం రీబూట్ ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్‌కు కృతజ్ఞతలు. మా కాన్సెప్ట్ ఆయనకు ఆసక్తిగా అనిపించడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా మా బ్యానర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు, ఇమేజ్‌ను తెస్తుందని నమ్ముతున్నా అని అన్నారు.
సంగీతం - శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ - వరుణ్ అంకర్ల,
స్క్రిప్ట్ సూపర్ విజన్: సుమ కార్తికేయ
ప్రొడక్షన్ డిజైన్: ఏఆర్ వంశీ
సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
పీఆర్వో: జీఎస్కే మీడియా
నిర్మాతలు: రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు,
రచన దర్శకత్వం - ప్రశాంత్ సాగర్ అట్లూరి.


Click it and Unblock the Notifications











