twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెటివ్ పాత్రలో సుమంత్... ‘ఇదం జగత్’ రిలీజ్ డేట్ ఖరారు!

    By Bojja Kumar
    |

    సుమంత్ హీరోగా 'ఇదం జగత్' మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు అఫీషియల్ ప్రకటన చేశారు. ఈ చిత్రంలో సుమంత్ సరసన అంజు కురియన్ నాయికగా నటిస్తోంది.

    విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది.

    Sumanths Idam Jagath release date Sep 28th

    ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుమంత్ ఈ చిత్రంలో కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయ్యబోతున్నాడు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోందని తెలిపారు.

    పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు ఇదం జగత్ అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుంది. ఈ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.

    ఈ చిత్రంలో ఇంకా శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్.

    English summary
    Sumanth’s upcoming thriller Idam Jagath has sealed September 28 as its release date. Debutant Anil Srikantam is the director and Premam actress Anju Kurien is the heroine of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X