Malli Modalaindi: ఓటీటీలో అక్కినేని హీరో మూవీ.. ఫన్నీగా రిలీజ్ డేట్ పోస్టర్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు ఉన్నారు. కానీ, వారిలో చాలా మందికి సక్సెస్‌లు మాత్రం అంతగా రావడం లేదు. అయినప్పటికీ అందులో పలువురు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సీనియర్ హీరో సుమన్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో కొన్ని విజయాలను మాత్రమే ఖాతాలో వేసుకున్నాడు. దీంతో చాలా కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందులో భాగంగా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ముందుకు వెళ్తున్నాడు.
కెరీర్ ఆరంభంలోనే ప్రేమకథా చిత్రాలనే చేస్తూ వచ్చిన సుమంత్.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో సినిమాలకు దాదాపుగా దూరం అయ్యాడు. అలా అడపాదడపా చిత్రాలను చేస్తూ వచ్చాడు. అయితే, ఇటీవల తన పంథాను పూర్తిగా మార్చి వైవిధ్యమైన చిత్రాలతో చేస్తున్నాడు. ఇందులో భాగంగానే కొంత కాలంగా డిఫరెంట్ జోనర్లలో సినిమాలను కూడా ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సుమంత్ 'మళ్లీ మొదలైంది' అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని చేస్తున్నాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇద్దరు భార్య భర్తలు విడాకులు తీసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న చిత్రమే 'మళ్లీ మొదలైంది'. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనివార్య కారణాలతో ఇది పలుమార్లు నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేశారు. అంతేకాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించడంతో పాటు వాటిని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అతి త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ మధ్య చిత్ర యూనిట్ కూడా వెల్లడించింది.
కొంత కాలంగా తెలుగు పరిశ్రమలో ఓటీటీలు హవాను చూపిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలించని కారణంగానో.. మరికొన్ని అంశాల వల్లో చాలా సినిమాలు వీటిలోనే నేరుగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సుమంత్ నటించిన 'మళ్లీ మొదలైంది' చిత్రాన్ని కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రిలీజ్ రైట్స్‌ను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సందరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించిందని సమాచారం. ఇక, ఈ మూవీని ఫిబ్రవరి 11 నుంచి అందులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఫన్నీ పోస్టర్‌ను విడుదల చేసి ప్రకటించారు.
సుమంత్ 'మళ్లీ మొదలైంది' మూవీలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరాజన్ కీలక పాత్రను చేసింది. రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని రకాల అప్‌డేట్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతుంది.


Click it and Unblock the Notifications











