కూలిన చెట్టు, కాలిన కారు నీకు న్యూస్.. ట్రైన్ యాక్సిడెంట్, మర్డర్ నాకు న్యూస్!
హీరో సుమంత్ వైవిధ్యభరితమైన కథలు ఎందుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. మళ్ళిరావా చిత్రంతో సుమంత్ ఫామ్ లోకి వచ్చాడు. ఇటీవల సుమంత్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడే మరో చిత్రాన్ని సుమంత్ రెడీ చేస్తున్నాడు. అనిల్ శ్రీకాంతం దర్శత్వంలో సుమంత్ లేటెస్ట్ మూవీ ఇదంజగత్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదుల చేశారు. సుమంత్, అంజు కురియన్ ఈ చిత్రంలో జంటగా నటించారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే సుమంత్ ఈ చిత్రంలో రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నాడు. జరుగుతున్న సంఘటనలని తనకు అనుకూలంగా మలుచుకునే రిపోర్టర్ గా సుమంత్ పాత్ర వైరైటీగా ఉంది. 'ఒక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడు అంటే దాని అర్థం వాడు మనకు చాలా దగ్గరగా వచ్చేశాడు అని' అంటూ సాగే డైలాగ్ బావుంది. గొడవల్ని ప్రోత్సహిస్తూ దానిని బ్రేకింగ్ న్యూస్ గా మార్చే రిపోర్టర్ గా సుమంత్ కనిపిస్తున్నాడు.
కూలిన చెట్టు, కాలిన కారు నీకు న్యూస్.. ట్రైన్ యాక్సిడెంట్, మర్డర్ నాకు న్యూస్ అంటూ సుమంత్ చెప్పే డైలాగ్ తన పాత్రకు అద్దం పట్టే విధంగా ఉంది. కమెడియన్ సత్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











