twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను ఇంకా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నారు, అది నిజం కాదు: సుమంత్

    |

    'సుబ్రహ్మణ్యపురం' తర్వాత సుమంత్ 'ఇదం జగత్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ కథానాయికగా పరిచయం అవుతోంది. విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.

    ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ... మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని కోణాలు ఉంటాయి. కేవలం బ్లాక్ అండ్ వైట్ మనపుషులు మాత్రమే ఉండరు. ఇలాంటి పాత్ర కోసం నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. నాకు ఎప్పుడూ రావనాసుడిని క్యారెక్టర్, దుర్యోధనుడి క్యారెక్టర్ ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్లోకి మారడానికి పెద్దగా కష్టపడలేదన్నారు.

    నన్ను శ్రీరామ చంద్రుడే అనుకుంటున్నారు, నిజం కాదు

    నన్ను శ్రీరామ చంద్రుడే అనుకుంటున్నారు, నిజం కాదు

    నన్ను అంతా 'గోదావరి' చిత్రంలో బోటు మీద శ్రీరామ చంద్రుడు క్యారెక్టర్‌లోనే ఉన్నాను అనుకుంటున్నారు. అది నిజం కాదు. థ్రిల్లర్స్ పట్ల ముందు పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు. నా మిత్రుడు శేష్‌ చేసిన క్షణం, గూఢచారి వల్ల ఆసక్తి పెరిగింది. అందుకే నేను కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నాను అని సుమంత్ తెలిపారు.

    చాలా కొత్తగా ఉండే థ్రిల్లర్

    చాలా కొత్తగా ఉండే థ్రిల్లర్

    ఈ సినిమా లాస్ట్ నవంబర్లో మొదలు పెట్టాం. చాలా ఆలస్యం అయింది. టెక్నికల్‌గా కొత్తగా ట్రై చేశాం. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ కనిపిస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ ట్రైలర్ చాలా కాలం గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం. ఇపుడు విడుదల చేయడం ఆనందంగా ఉంది.

    ఆసక్తి రేపుతున్న ట్రైలర్

    ఇదం జగత్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. సుమంత్ కెరీర్లో ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ అవుతుందని భావిస్తున్నారు.

    సుమంత్ కష్టపడ్డాడు

    సుమంత్ కష్టపడ్డాడు

    నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ "సుమంత్‌ ఈ సినిమాకు కష్టపడ్డట్టు ఏ సినిమాకూ కష్టపడిఉండరు. రాత్రి, పగలు అని తేడా లేకుండా షూటింగ్‌ చేశారు. ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌' తెలిపారు.

    English summary
    Idam Jagath Movie Theatrical Trailer launch held at Hyderabad. Sumanth, Adivi Sesh, Anil Srikantam, Jonnalagadda Padmavathi, Gangapatnam Sridhar, Sricharan Pakala at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X