డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన సుమంత్.. బాలీవుడ్ స్టార్ హీరోకు వాయిస్

బాలీవుడ్‌ తెరపై లెంజెడరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా 83 అనే మూవీ తెరకెక్కుతున్నది. 1983 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన నేపథ్యంగా ఈ సినిమాకు 83 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నది.

83 చిత్రాన్ని పలు భాషల్లో అంటే హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం రిలీజ్ చేస్తున్నారు. తమిళ, తెలుగుల్లో రిలీజ్ చేయడానికి కమల్ హాసన్, నాగార్జున అక్కినేని నిర్ణయం తీసుకొన్నారు. అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్‌పై నాగార్జున, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ రిలీజ్ చేస్తున్నారు. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మలయాళంలో సుదీపా కిచ్చ తన షాలిని ఆర్ట్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.

Sumanth turns dubbing artist to Ranveer Singh for 83 movie

అయితే తెలుగు భాషలో డబ్బింగ్ అవుతున్న 83 చిత్రానికి సుమంత్ భాగం కావడం చర్చనీయాంశమైంది. రణ్‌వీర్ సింగ్ పోషించిన పాత్రకు సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ విషయాన్ని సుమంత్ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 83 చిత్రంలో రణ్‌వీర్ సింగ్ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాను. తెలుగు వెర్షన్‌లో భాగమయ్యాను అంటూ ట్విట్టర్లో సుమంత్ తెలిపారు.

ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో రూపొందిన 83 చిత్రంలో రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్‌తోపాటు హార్డీ సంధూ, అమ్మీ విర్క్, సాహిల్ కట్టార్, చిరాగ్ పటేల్, తాహిర్ రాజ్ భాసిన్, జతిన్ శర్న, నిషాద్ దహియా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X