నా లవర్ టెర్రరిస్టు కాదు.. హృతిక్‌పై సోదరి సునైనా ఫైర్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ ప్రేమ వ్యవహారం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్నాయి. తన తండ్రి రాకేశ్ రోషన్, సోదరుడు హృతిక్ రోషన్ తన జీవితాన్ని నరకంగా మార్చుతున్నారని సునైనా మీడియాలో ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహరం కొత్త మలుపు తిరిగింది. హృతిక్ సోదరి ప్రేమకు ఇంట్లో నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం ఓ కారణంగా చెప్పుకొంటున్నారు. అలాగే డబ్బుకు సంబంధించిన అంశాలు కూడా గొడవలకు కారణమని తెలుస్తున్నది.
గతేడాది కాలంగా ఢిల్లీలోకి చెందిన రుహైల్ అనే ముస్లిం యువకుడితో ప్రేమలో ఉన్నాను. నా ప్రేమను ఇంట్లో తండ్రి, సోదరుడు అంగీకరించడం లేదు. నా ప్రియుడు ఓ టెర్రరిస్టు అని ముద్ర వేస్తున్నారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా లవర్ ఓ రిపోర్టర్ అని సునైనా చెప్పింది.

నా కోసం సొంత ఇంటిని సమకూరుస్తానని హృతిక్ చెప్పాడు. కానీ నా కోసం ఇంటిని ఏర్పాటు చేయడం లేదు. లోకండ్ వాలాలో ఇళ్లు చూసుకొంటే.. దాని కోసం రూ.2.5 లక్షలు ఎందుకని హృతిక్ ఒప్పుకోలేదు. . అంత డబ్బు దుబారా చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. 50 వేలు ఇస్తానని చెబుతున్నాడు. 50 వేలు నాకు నెలసరి ఖర్చులకు సరిపోతాయా అని సునైనా అన్నారు.


Click it and Unblock the Notifications











