సందీప్ కిషన్ వచ్చేందుకు డేట్ ఫిక్స్.. ఆ రోజే థియేటర్లో రచ్చ

సందీప్ కిషన్ ప్రస్తుతం హిట్ ట్రాక్ మీదున్నాడు. చివరకు తెనాలి రామకృష్ణ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే సందీప్ కిషన్ మాత్రం తన రేంజ్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ పడలేదు. అయితే సందీప్ కిషన్ మాత్రం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. అలా హారర్, కామెడీ, థ్రిల్లర్ ఎన్నో విభిన్న చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఏ1 ఎక్స్‌ప్రెస్ అంటూ ఇప్పటి వరకు వదిలిన పాటలు, టీజర్,ట్రైలర్, పోస్టర్లు అన్నీ కూడా బాగానే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి గ్లామర్, యాక్షన్, రొమాంటిక్ సీన్స్‌కు కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే ఫిబ్రవరిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని చూశారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలను మార్చుకున్నారు.

 Sundeep kishan a1 express On 5th March

తాజాగా ఏ1 ఎక్స్‌ప్రెస్ మూవీ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను ఇచ్చారు. ఈ చిత్రం మార్చి 5న విడుదల కాబోతోందంటూ ప్రకటించారు. ఈ మేరకు సందీప్ కిషన్ కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ.. హాకి నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కించిన మొదటి చిత్రమిదని.. పద్నాలుగు మంది కొత్త యంగ్ టెక్నిషియన్స్‌ను పరిచయం చేయబోతోన్నాంటూ చెప్పుకొచ్చాడు. రిలీజ్ డేట్ అంటూ వదిలిన పోస్టర్‌లో సందీప్ కిషన్, లావణ్యల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X