Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘గల్లీ రౌడీ’ రిలీజ్‌పై సందీప్ కిషన్ క్లారిటీ: అందులోనే విడుదల చేస్తామంటూ ప్రకటన
చాలా కాలంగా హిట్ కోసం అన్వేషిస్తోన్న హీరోల్లో టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడుతోన్న అతడు.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే చిత్రంలో నటించాడు. ఇది షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల మాత్రం కాలేదు. దీంతో ఈ సినిమా విడుదలపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా సందీప్ కిషన్ దీనిపై స్పందించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసి క్లారిటీ ఇచ్చాడు.
వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి డైరెక్షన్లో సందీప్ కిషన్ నటించిన చిత్రమే 'గల్లీ రౌడీ'. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో సందీప్ కిషన్ ట్విట్టర్లో 'గల్లీ రౌడీ థియేటర్ల విడుదల చేసే మంచి వినోదాత్మక చిత్రం. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేని కారణంగా థియేటర్ యాజామాన్యాల నిర్ణయంతో పాటు సరైన డేట్ కోసం వేచి చూస్తున్నాం. మాకు అండగా నిలిచిన కోన వెంకట్ సార్‌కు ధన్యవాదాలు. ఇకనైనా రూమర్లు పుట్టించే వారు శాంతించండి' అని పోస్టు చేశాడు.
పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రాబోతున్న 'గల్లీ రౌడీ'పై అంచనాలు బాగానే ఉన్నాయి. విశాఖపట్నం బ్యాగ్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ తొలిసారి కామెడీ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, హర్షలు కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.