The family man 3: మరొక సర్ ప్రైజ్ పాత్రలో తెలుగు హీరో.. ఆ సీజన్ మొదలయ్యేది ఎప్పుడంటే?

సినిమా ఇండస్ట్రీ కి మొదట్లో చిన్న నటులుగా రంగప్రవేశం చేసి, ఆపై మెల్లగా తమ టాలెంట్ తో అవకాశాలు అందుకుని ప్రస్తుతం హీరోగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్న వారు నేడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో యువ నటుడు సందీప్ కిషన్ కూడా ఒకరు అని చెప్పాలి.

ఫస్ట్ టైమ్ ప్రస్థానం సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులని ఆకట్టుకున్న యువ నటుడు సందీప్ కిషన్, అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగారు. ఆపై రొటీన్ లవ్ స్టోరీ మూవీ తో హీరోగా మారిన సందీప్ ఆ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో వెబ్ సిరీస్ వరల్డ్ లోకి కూడా మెల్లగా అడుగు పెడుతున్నాడు.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా

వరుసగా హీరోగా ఛాన్స్ లతో కొనసాగిన సందీప్ కి మొదట మేర్లపాక గాంధీ తీసిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ పెద్ద బ్రేక్ ని అందించింది. అక్కడి నుండి నటుడిగా మరింతగా దూసుకెళ్లి పలు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న సందీప్ కిషన్ ఇటీవల తెనాలి రామకృష్ణ, ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కాగా వాటిలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా మరింతగా గొప్ప విజయం అందుకోవడంతో పాటు నటుడిగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ మూవీతో సందీప్ నిర్మాతగా కూడా మారాడు.

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా

ప్రముఖ ఫోటోగ్రాఫర్ చోట కె నాయుడు తనకు మావయ్య అయినప్పటికీ కూడా ఆయన నుండి ఎటువంటి సహకారం తీసుకోకుండా సొంతంగా ఛాన్సులు అందుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైన క్రేజీ హీరోగా కొనసాగుతున్న సందీప్ కిషన్ తప్పకుండా రాబోయే రోజుల్లో మరింతగా సక్సెస్ లు అందుకుని ముందుకు సాగుతారని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఫ్యామిలీ మ్యాన్ 3లో కూడా

ఫ్యామిలీ మ్యాన్ 3లో కూడా

అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సందీప్ మాట్లాడుతూ ప్రస్తుతం తన కెరీర్ ఎంతో బాగా ముందుకు సాగుతోందని, ఈ గల్లీ రౌడీ మూవీ పై తమ యూనిట్ అందరికీ మంచి నమ్మకం ఉందని అన్నారు. కాగా త్వరలో రాబోయే రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వారి ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ లో తాను ఒక కీలక పాత్ర చేయబోతున్నట్లు సందీప్ వెల్లడించారు.

Recommended Video

Sundeep Kishan Road Show | A1 Express విజయ యాత్ర
సీజన్ 3 ఎప్పుడంటే?

సీజన్ 3 ఎప్పుడంటే?

నిజానికి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 లో ఇండియన్ ఆర్మీ మేజర్ విక్రమ్ పాత్రలో తనదైన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ ని అలరించారు సందీప్. నిడివి పరంగా చిన్న పాత్ర అయినప్పటికీ అది సందీప్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి. అయితే అందుతున్న న్యూస్ ప్రకారం ఫ్యామిలీ మ్యాన్ 3 లో సందీప్ ది ముఖ్యమైన పాత్ర అని, అలానే ఆ పాత్ర కోసం ఆయన భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వినికిడి.

మొత్తంగా తన కెరీర్ లో ప్రస్తుతం ఒక్కొక్కటిగా మంచి అవకాశాలతో కొనసాగుతున్న సందీప్ కిషన్ రాబోయే రోజుల్లో వాటి ద్వారా ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి. ఇక ఫ్యామిలీ మ్యాన్ 3ను 2022 మొదలు పెట్టి అదే ఏడాది చివర్లో రిలీజ్ చేసే అవకాశం ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X