Gully rowdy teaser: అంచనాల డోస్ పెంచిన గల్లీ రౌడి.. విజయ్ దేవరకొండ వదిలిన టీజర్ అదుర్స్!
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. ఈ హీరో ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ హైలెట్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రయోగాలు చేయడమే కాకుండా కమర్షియల్ గా అన్ని రకాల సినిమాలను టచ్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో గల్లీ రౌడి అనే మరో సినిమాతో రెడీ అవుతున్నాడు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆ సినిమా టీజర్ ను విడుదల చేస్తూ.. అందరిని నవ్వించడానికి ఈ సినిమా రెడీ అవుతుందని, ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి తన విశేష్ అందిస్తున్నట్లు విజయ్ ట్వీట్ చేశాడు. ఇక టీజర్ ను చూస్తుంటే ఈసారి సందీప్ కిషన్ మరో బాక్సాఫీస్ హిట్టు కొట్టేలా ఉన్నాడని టాక్ అయితే వస్తోంది. ఫ్యామిలీ సపోర్ట్ తో రౌడీగా మారే కుర్రాడు హీరోయిన్ చెప్పిన కిడ్నాప్ తో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు అనేది సినిమా అసలు పాయింట్ అని తెలిసిపోయింది.

అయితే ఈ ట్రావెల్ లో హీరో అతని చుట్టూ ఉంటే పాత్రలు ఎదుర్కొన్న అనుభవాలను కామెడీగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ఫన్నీ డైలాగ్స్ అలాగే సందీప్ కిషన్ న్యూ లుక్ సినిమాపై అంచనాల డోస్ ను పెంచేస్తున్నాయి. ఇక చివరగా సందీప్ కిషన్ చెప్పిన 'నెపోటిజమ్' డైలాగ్ కూడా ఓ వర్గం వారికి బాగానే కనెక్ట్ అయ్యింది. మరి సినిమా టీజర్ కు తగ్గట్లుగానే మెప్పిస్తుందో లేదో చూడాలి. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











