షూటింగ్‌లో బాంబ్ బ్లాస్ట్.. హీరో సందీప్ కిషన్‌కు తీవ్ర గాయాలు.. హైదరాబాద్‌కు తరలింపు!
తెలుగు సినిమా పరిశ్రమలోని యువ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య స్వల్ప ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా యువ హీరో సందీప్ కిషన్‌ను ప్రమాదం వెంటాడింది. తెనాలి రామకృష్ణ షూటింగ్‌లో సందీప్ కిషన్ గాయపడటం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ప్రమాదం ఎలా జరిగిందంటే..

కర్నూలులో షూటింగ్ జరుగుతుండగా
కర్నూల్‌లో సందీప్ కిషన్ నటిస్తున్న తెనాలి రామకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రాన్ని దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌లో భాగంగా శనివారం యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. ఫైట్ మాస్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో బాంబ్ బ్లాస్ట్ జరిగి సందీప్ కిషన్‌కు గాయాలైనట్టు సమాచారం. గాయపడిన సందీప్ కిషన్‌ను వెంటనే కర్నూల్‌లోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.

హైదరాబాద్‌కు తరలింపునకు
సందీప్ కిషన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్వల్ప గాయాలకు చికిత్స చేశారు. అది పూర్తయిన అనంతరం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌కి తీసుకువస్తారు. అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాయాలు
సందీప్ కిషన్ ఛాతీ, కుడి చేతిపై గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. వెంటనే కర్నూలు మై క్యూర్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ప్రాధమిక చికిత్స అందిస్తున్నారు అని సందీప్ కిషన్ పీఆర్ వర్గాలు తెలిపాయి.

తెనాలి రామకృష్ణ మూవీ గురించి
సందీప్ కిషన్, హన్సిక హీరో హీరోయిన్లుగా 'తెనాలి రామకృష్ణ- బిఏబిఎల్' సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. భూమిక చావ్లా కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బేనర్లో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకుడు: జి నాగేశ్వరరెడ్డి ,
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి,
నిర్మాణ సంస్థ: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్,
సమర్పకులు: ఇదుమూరి శ్రీనివాసులు,
కో ప్రొడ్యూసర్: రూప జగదీష్, మహేశ్వరరెడ్డి,
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల,
కథ, స్క్రీప్ ప్లే: టి రాజసింహ,
సంగీతం: శేఖర్ చంద్ర,
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు,
అసోసియేట్ డైరెక్టర్స్: చిట్టి, శివ,
స్క్రీప్ ప్లే: విక్రమ్ రాజ్, గోపాల కృష్ణ,
ఆర్ట్: కిరణ్,
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్,
మాటలు: నివాస్, భవానీ ప్రసాద్.


Click it and Unblock the Notifications











