రీతూ వర్మని ముద్దుల్లో ముంచేసిన స్టార్ హీరో.. లైవ్‌లోనే , ఏంటి సంగతి?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో తమతో పాటు నటించిన నటీనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న వారెందరో. వాలంటైన్స్ డే సందర్భంగా నిన్నంతా దీనిపైనే చర్చ నడిచింది. ఛానెల్స్, వెబ్‌సైట్స్ సెలబ్రెటీల ప్రేమ గురించి కథనాలను ప్రసారం చేశాయి. ప్రేమికుల దినోత్సవం నాడు ఓ హీరో హీరోయిన్ మధ్య చోటు చేసుకున్న యవ్వారానికి సంబంధించి వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఎందరో అమ్మాయిలు బహిరంగంగానే విమర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఈ కోవలోకే వస్తారు అచ్చ తెలుగు అమ్మాయి రీతూ వర్మ. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఎవ్వరూ లేనప్పటికీ అన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు రీతూ. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన ఆమె.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ సత్తా చాటారు. ఆపై సినీరంగ ప్రవేశం చేసిన రీతూ వర్మ చిన్నా చితకా పాత్రలతో తన ప్రతిభ నిరూపించుకున్నారు.

Sundeep Kishan Kissing Ritu Varma during Mazaka movie promotions

హీరోలు, హీరోయిన్లకు ఫ్రెండ్‌గా, అక్క, చెల్లి వంటి క్యారెక్టర్లలో రీతూ వర్మ నటించారు. ఈ దశలో ప్రేమ ఇష్క్ కాదల్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ వర్మ.. విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులతో బ్రేక్ అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా నంది అవార్డ్ సహా పలు పురస్కారాలను దక్కించుకుంది.

అనంతరం కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, కణం, స్వాగ్ వంటి చిత్రాల్లో నటించారు రీతూ. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ అదృష్టం పరీక్షించుకున్న ఆమె.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ధనుష్, దుల్కర్ సల్మాన్ , విశాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగులో మజాకా, తమిళ్‌లో ధ్రువ నచ్చత్రం చాప్టర్ 1లో రీతూ వర్మ నటిస్తున్నారు.

సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మజాకా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. రావు రమేశ్, అన్షు అంబానీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. తాజాగా లవర్స్ డేను పురస్కరించుకుని రీతూ వర్మ బేబీ మా సాంగ్‌కి రీల్ చేస్తుండగా సందీప్ కిషన్ ఆమె బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ..నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: sundeep kishan ritu varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X