ప్రధాని సందేశం.. బిగ్‌బాస్ తరహాలో స్పందిస్తూ యంగ్ హీరో సెటైర్
ప్రపంచాన్ని గడగడవణికిస్తోన్న కరోనా వైరస్ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటి వాటిని ప్రవేశ పెట్టింది. అయినా క్రమక్రమంగా పరిస్థితి చేజారిపోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 21 రోజుల లాక్ డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్న ప్రధాని.. నేటి ఉదయం మరో సందేశాన్ని ఇచ్చాడు.
ప్రజలంతా కరోనాను ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారని, లాక్ డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలని కోరాడు. ఈ మేరకు ఏప్రిల్ 5న అందరం కలిసి కరోనా వైరస్ అనే అంధకారాన్ని తరిమికొట్టాలనే పిలుపునిచ్చాడు. 130కోట్ల మంది ప్రజలు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి టార్చ్, మొబైల్ లైట్‌లు, కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించాలని, తద్వారా తాము ఒంటరి కాదనే సంకల్పాన్ని చాటి చెప్పాలని కోరాడు.

ప్రధాని ఇచ్చిన ఈ సంకల్ప సందేశం మీద యంగ్ హీరో సందీప్ కిషన్ సెటైరికల్‌గా స్పందించాడు. కొత్త టాస్క్ వచ్చిందంటగా.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లందరూ ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్స్ ఆపేసి కొవ్వొత్తులు లేదా టార్చిలైట్స్ వెలిగించాలని బిగ్ బాస్ కోరుకుంటున్నారు అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











