సందీప్ కిషన్ ఆవిష్కరించిన 'క్షీర సాగర మథనం'
శ్రీ వెంకటేశ పిక్చర్స్, ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు అనిల్ పంగులూరి పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఆవిష్కరించారు. దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచికి అద్దం పడుతూ.. తెలుగుదనం ఉట్టి పడే 'క్షీర సాగర మథనం' అనే పేరును ఈ చిత్రం కోసం ఎంపిక చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో 'క్షీర సాగర మథనం' చిత్ర కథానాయకుడు మానస్ నాగులపల్లి, ప్రదీప్, కథానాయిక చరిష్మా, చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి, ప్రముఖ మహిళా నిర్మాత పద్మినీ నాగులపల్లి పాల్గొన్నారు.

'క్షీరసాగర మథనం' అనే ఆహ్లాదకరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం.. టైటిల్‌కి తగ్గట్లు ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా సందీప్ కిషన్ కోరుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.


Click it and Unblock the Notifications











