ఆ ఓటీటీలో సందీప్ కిషన్ ‘A1 ఎక్స్‌ప్రెస్’: ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందంటే!

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ, సుదీర్ఘమైన కెరీర్‌లో చాలా తక్కువ విజయాలనే అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పక్కాగా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో సరికొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య 'A1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్ల పరంగా మాత్రం నష్టాలనే ఎదుర్కొవలసి వచ్చింది. దీంతో అతడికి మరోసారి నిరాశ తప్పలేదు. ఇక, ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ బయటకు వచ్చింది.

స్విమ్ సూట్‌లో క్లీవేజ్ షోతో‌ సెగలు రేపుతోన్న పార్వతి నాయర్

డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన 'A1 ఎక్స్‌ప్రెస్' మూవీ హాకీ నేపథ్యంతో వచ్చింది. ఈ మూవీకి టాక్‌గా మంచిగా ఉన్నా.. కరోనా పరిస్థితుల కారణంగా ప్రేక్షకుల థియేటర్లకు రాలేకపోయారు. ఇలాంటి సమయంలో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ నెక్ట్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగానే ఈ చిత్రాన్ని మే 1వ తేదీ నుంచి అందులో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తద్వారా థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసే అవకాశం ఉంది. దీంతో దీనికి మంచి స్పందనే వస్తుందని అంటున్నారు.

Sundeep Kishans A1 Express Sun Nxt Streaming from May 1st

తెలుగులోనే మొట్టమొదటి హాకీ సినిమాగా వచ్చింది 'A1 ఎక్స్‌ప్రెస్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాను విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలోని 'సింగిల్ కింగులం' అనే పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాట రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X