‘గల్లీ రౌడీ’పై ఆ మూవీ ఎఫెక్ట్: సందీప్ కిషన్ కెరీర్‌లోనే తొలిసారి అలాంటి రికార్డు
అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. సరైన బ్రేక్‌ను మాత్రం దక్కించుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. కెరీర్ ఆరంభంలో వచ్చిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్'.. రెండేళ్ల క్రితం చేసిన 'నిను వీడని నీడను నేనే' మినహా అతడి కెరీర్‌లో భారీ హిట్లు మాత్రం అస్సలు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరుస పెట్టి సినిమాలను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే సినిమాను చేస్తున్నాడు. అతడి కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సందీప్ కిషన్.. వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' అనే సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు నేరుగా రిలీజ్ చేసేందుకు ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. దీంతో చిత్ర యూనిట్ దీనికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే.. 'గల్లీ రౌడీ' డైరెక్టుగా ఓటీటీలోనే విడుదల కాబోతుందని అంటున్నారు.

ఇది సందీప్ కిషన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని తెలిసింది. ఈ సినిమాకు ఇంతటి ఆఫర్ రావడానికి కారణం.. అతడి గత చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'కు సన్ నెక్ట్స్ ఓటీటీలో భారీ స్పందన రావడమే అనే టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో నిరాశనే ఎదుర్కొన్న ఈ మూవీ.. ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఫన్ అండ్ ఎమోషన్స్‌తో రూపొందుతోన్న 'గల్లీ రౌడీ'పై సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడట దర్శకుడు. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











