చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి.. ఏకంగా బాస్ షర్ట్‌తో వెళ్లి ఫిదా చేసేశాడుగా!

తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో చాలా మంది సరైన బ్రేక్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ, వాటిలో రెండు, మూడు మినహా మిగిలినవి అన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ హీరో ఎన్నో ఏళ్లుగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అంటూ వచ్చాడు. ఇది ఆకట్టుకున్నా ప్రతికూల పరిస్థితుల కారణంగా హిట్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది.

వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న సందీప్ కిషన్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే వినోదాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'గల్లీ రౌడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీని గతంలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అప్పుడు ఇది సాధ్య పడలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ, ఇటీవలే ఈ సినిమాను సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, దీన్ని అప్పుడు కూడా విడుదల చేయలేదు.

Sundeep Kishans Gully Rowdy Trailer Released

ప్రస్తుతం సినీ పరిశ్రమలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగానే 'గల్లీ రౌడీ' చిత్ర రిలీజ్‌ను ఆపేశారని జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అంతేకాదు, థియేటర్లలో నవ్వుల జల్లులు కురవబోతున్నాయని చెప్పి అంచనాలు పెంచేశారు. ఇక, ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' మూవీ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి సెప్టెంబర్ 12న విడుదల చేస్తారని ముందుగానే యూనిట్ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే తాజాగా చిత్ర యూనిట్ ఆయన ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సందీప్ కిషన్ చిరంజీవి బొమ్మతో పాటు బాస్ అనే అక్షరాలను ముద్రించిన షర్ట్‌ను ధరించాడు. దీనికి సంబంధించిన ఫొటోను స్వయంగా అతడు ట్వీట్ చేశాడు. ఇక, ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది ఆద్యంతం వినోదభరితంగా సాగింది. ఇందులో హీరో 'రౌడీ' అని చెప్పుకుంటూ కనిపించాడు. మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చూపించారు. మొత్తానికి ఇది అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా ఉంది.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గల్లీ రౌడీ' మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ తొలిసారి కామెడీ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, హర్షలు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X