‘రౌడీ బేబీ’ని అలా మార్చేసిన సందీప్ కిషన్: కొత్త టైటిల్‌లో అది మాత్రం కామన్‌గానే
కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. కథల ఎంపికలో తేడా కొట్టడంతో కెరీర్ ఆరంభం నుంచీ వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. అప్పుడెప్పుడో వచ్చిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్' మినహా పెద్దగా సక్సెస్‌ను అందుకోలేకపోయిన అతడు.. ఆ మధ్య వచ్చిన 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మళ్లీ పలు పరాజయాలతో నిరాశే ఎదురైంది. ఇలాంటి సమయంలో ఇటీవల 'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్. ఇది హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు రాబట్టలేక ఏవరేజ్‌గానే ముగిసింది.
సరైన హిట్ కోసం వేచి చూస్తోన్ సందీప్ కిషన్ ప్రస్తుతం జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి విచిత్రం 'రౌడీ బేబీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌తో చాలా భాగం చిత్రీకరించారు. ఇలాంటి సమయంలో ఈ మూవీ టైటిల్‌ను మార్చబోతున్నాం అని చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 'కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మా రౌడీ బేబీ టైటిల్‌ను మార్చేస్తున్నాం. త్వరలోనే మరింత ఆసక్తికరమైన కొత్త టైటిల్‌ను ప్రకటిస్తాం' అని తెలిపింది.
కసరత్తుల పేరుతో మలైకా అరోరా గ్లామర్ షో.. పొట్టి దుస్తుల్లో మరింత బోల్డ్‌గా

ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ - నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా కొత్త టైటిల్‌ను తాజాగా వెల్లడించారు. దీనికి 'గల్లీ రౌడీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఓ వీడియోను రూపొందించి వదిలారు. అందులో 'రౌడీ బేబీ ఇప్పుడు గల్లీ రౌడీ' అని పేర్కొన్నారు. పాత కొత్త టైటిళ్లలో రౌడీ అనేది కామన్ పాయింట్‌గా ఉంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











