twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెనాలి రామకృష్ణ ట్విట్టర్ రివ్యూ.. హైలైట్ సన్నివేశాలు అవే!

    |

    యంగ్ హీరో సందీప్ కిష‌న్ చేసిన కొత్త చిత్రం 'తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌'. ఎస్‌.ఎన్‌.ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జ‌వ్వాజి రామాంజ‌నేయులు స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కిన ఈ సినిమాకు 'కేసులు ఇవ్వండి ప్లీజ్‌' అనేది ట్యాగ్ లైన్‌. అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజే (న‌వంబ‌ర్ 15వ తేదీ) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గత రాత్రి యూఎస్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్స్, స్పెషల్ షో చూసిన కొందరు నెటిజన్లు ఈ సినిమాపై స్పందించారు. ఆ వివరాలు చూద్దామా..

    వన్ మ్యాన్ షో

    సందీప్ కిషన్ వన్ మ్యాన్ షో చేశాడు. కామెడీ పార్ట్ బాగా నవ్వించింది. సినిమాకు స్టోరీ ప్రధాన బలం అని చెపుకోవచ్చు.. అంటూ ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన ఓ నెటిజన్ స్పందించాడు.

    ఫ్యామిలీతో వెళ్లి..

    తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌ ఫ్యామిలీతో వెళ్లి చూడాల్సిన సినిమా. సూపర్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీతో వెళ్లి ఈ వీకెండ్‌లో చూడొచ్చు.

    హైలైట్ సీన్స్ ఇవే

    కోడికత్తి మరియు గ్రామ వాలంటీర్ సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి. కడుపుబ్బా నవ్వించాయి.

    సందీప్ కిషన్ కామిక్ టైమింగ్

    తెనాలి రామ‌కృష్ణ సినిమాలో సందీప్ కిషన్ కామిక్ టైమింగ్ బాగుంది. సెకండాఫ్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఈజీలీ వాచబుల్ మూవీ.

    Recommended Video

    #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House

    చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్

    చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ ఆన్ స్క్రీనింగ్ హిట్ ఇచ్చాడు. కాంగ్రాచులేషన్స్ సందీప్ కిషన్ బ్రో.. అంటూ తెనాలి రామకృష్ణ చూసి ఓ నెటిజన్ మురిసిపోయాడు.

    హిలేరియస్ ఎంటర్‌టైనర్

    తెనాలి రామకృష్ణ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్. పర్ఫెక్ట్ కామెడీ పిక్చర్. సూపర్ హిట్ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

    తెనాలి వినాలి

    నలుగురికి చెడు చేస్తే కిందికి పోతారు.. అదే నలుగురికి మంచి చేస్తే పైకి లేస్తారు డైలాగ్ బాగుంది. తెనాలి వినాలి హిట్ అన్నాడు మరో నెటిజన్.

    English summary
    Tenali Ramakrishnudu B.A.BL is Hansika Motwani's new movie which is directed by G. Nageshwar reddy. In this movie Hansika playing Lawyer role first time. This movie twiiter responce is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X