కోర్టులో సందీప్ కిషన్.. అదొక్కటే తేడా హీరో ట్వీట్.. ఫన్నీ వీడియో
యంగ్ హీరో సందీప్ కిషన్ చేస్తున్న కొత్త చిత్రం 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు 'కేసులు ఇవ్వండి ప్లీజ్' అనేది ట్యాగ్ లైన్. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా ప్రమోషన్స్ మరింత వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉన్నట్లుగా ఈ అప్‌డేట్స్ ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరో ప్రమోషన్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు హీరో సందీప్ కిషన్.

ఈ మేరకు ''ఆ తెనాలి రామకృష్ణ దర్బార్‌కి వెళ్లి నవ్విస్తూ న్యాయాన్ని నిలబెట్టే వాడు.. ఈ తెనాలి రామకృష్ణ కోర్టుకు వెళ్లి నవ్విస్తూ న్యాయాన్ని నిలబెడతాడు. మిగితాందంతా సేమ్ టు సేమ్'' అని పేర్కొంటూ సినిమాలోకి ఆసక్తికర సన్నివేశాలతో కట్ చేయబడిన ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుంచాడు.
కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, మెసేజ్ ఇలా అన్నీ సమపాళ్లలో ఉన్నాయని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అందాల తార హన్సిక నటిస్తోంది. మరో హీరోయిన్‌గా తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. హన్సిక తొలిసారి లాయర్ పాత్ర పోషిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











