Michael: తెలుగు వాళ్లలా తమిళులు కాదు.. సినీ ఇండస్ట్రీలపై సందీప్ కిషన్ షాకింగ్ కామెంట్స్!

హిట్స్, ఫ్లాప్స్ పట్టించుకోకుండా విభిన్న సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం సందీప్ కిషన్ తన కెరీర్ లోనే పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. సందీప్ కిషన్ కు బ్యూటిఫుల్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ జోడి కడుతున్న ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్ అండ్ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉండగా.. ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు సందీప్ కిషన్.

స్టార్ కాస్టింగ్ తో..

స్టార్ కాస్టింగ్ తో..

సందీప్ కిషన్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్నడూ కనపించని విధంగా సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకోనున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగానే నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ పోస్టర్స్ విడుల చేశారు.

లిప్ లాక్ సీన్ కు..

లిప్ లాక్ సీన్ కు..

అలాగే మైఖేల్ మూవీ టీజర్ కూడా ఎంతగానో ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ ను నందమూరి నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. జనవరి 23న విడుదలై ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. లవ్ అండ్ రివేంజ్, గ్యాంగ్ స్టర్ వంటి డార్క్ థీమ్ తో సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో సందీప్ కిషన్ చేసిన లిప్ లాక్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది.

 లోకేష్ కనకరాజ్ తో ప్రమోషన్..

లోకేష్ కనకరాజ్ తో ప్రమోషన్..

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో తమిళ సినీ ఇండస్ట్రీపై పలు వ్యాఖ్యలు చేశాడు సందీప్ కిషన్. అక్కడ విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ మైఖేల్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపాడు.

 ఎక్కువ చోట్లకు తీసుకెళ్లాలి..

ఎక్కువ చోట్లకు తీసుకెళ్లాలి..

"మైఖేల్ సినిమాను ఎంతో ఇష్టంతో తెరకెక్కించాం. చేయగా చేయగా ఇంకా బాగా వచ్చింది. నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. బిజినెస్ బాగా జరుగుతోంది. ఏదో గొప్పగా చెప్పట్లేదు. ఇన్ పుట్ బాగా వచ్చి జనాలు నమ్ముతున్నారు అంటే మార్కెట్ కూడా పెరుగుతుంది. అప్పుడు సినిమాను ఇంకా బాగా ఎక్స్ ప్లోర్ చేయగలం. సో ఇలా చేసేటప్పుడు ఈ సినిమా ఎక్కువ చోట్లకు తీసుకెళ్లాలి. ఎక్కువ జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయాలి అంటే తమిళంలో కూడా ఒక స్ట్రాంగ్ నేమ్ ఉంటే బాగుంటుందని అనిపించింది" అని సందీప్ కిషన్ తెలిపాడు.

డబ్బింగ్ చిత్రంలాగే..

డబ్బింగ్ చిత్రంలాగే..

"మైఖేల్ చిత్రాన్ని ఎక్కువ చోట్లకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ ప్రైమర్లీ ఇది తెలుగు సినిమా. అయితే ప్రతిసారీ ఎఫెక్ట్ ఏమవుతుందంటే.. తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేసి వస్తే.. కంఫర్ట్ గా రిసీవ్ చేసుకుంటున్నాం. కానీ తెలుగు చిత్రాలను డబ్ చేసి తమిళంలోకి తీసుకెళ్తే.. దాన్ని డబ్బింగ్ మూవీలాగే నిలిచిపోతుంది. దాన్ని ఒక స్ట్రయిట్ సినిమాలాగా ఒప్పుకోవట్లేదు. రిసీవ్ చేసుకోవట్లేదు" అని హీరో సందీప్ కిషన్ పేర్కొన్నాడు.

20 నిమిషాలు చూసి..

20 నిమిషాలు చూసి..

ఇంకా సందీప్ కిషన్ కంటిన్యూ చేస్తూ "ఎక్కడో మా సినిమాకు కుదిరిన అదృష్టం ఏంటంటే.. నా సినిమాలు కొన్ని తమిళంలో వర్కౌట్ అవ్వడం.. రంజిత్ ఇంతకుముందు తమిళ్ లో హిట్లు ఇవ్వడం. సేతు (విజయ్ సేతుపతి) అన్న ఉండటం.. ఇంకొక్క చిన్న స్ట్రాంగ్ పర్సన్ కావాలనిపించింది. లోకేష్ అనేవాడు అంత ఈజీగా ఒప్పుకోడు. కంటెంట్, సినిమాను నమ్మితేనే వస్తాడు. సో అలాంటి వాడు ఒక్క సినిమాను నమ్ముతున్నాడు అని ఆడియెన్స్ కి తెలియాలి. సినిమాను 20 నిమిషాలు చూసి బాగుందని చెప్పాడు. ఇప్పటివరకు బాగుందని చెబుతూనే ఉన్నాడు" అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X