Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అదరగొడుతోన్న ‘A1 ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్: దెబ్బకు నెంబర్ వన్ ప్లేస్‌లోకి సందీప్ మూవీ
అప్పుడెప్పుడో హీరోగా పరిచయమై.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు పరితపిస్తున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సందీప్ కిషన్. 'ప్రస్థానం' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అతడు.. ఆ వెంటనే 'షోర్ ఇన్ ద సిటీ' అనే హిందీ చిత్రాన్ని కూడా చేశాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడికి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇలాంటి సమయంలో రెండేళ్ల క్రితం 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మరోసారి విజయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సందీప్ కిషన్ 'A1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంతో సాగే ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా చేస్తోంది. హిప్ ఆప్ తమీజా సంగీతం సమకూర్చుతున్నాడు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం 'A1 ఎక్స్‌ప్రెస్' ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ఆటగాడిగా నటిస్తున్నాడు. ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ జాతీయ క్రీడగా ఎంపికైన హాకీ.. ఇప్పుడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమానే 'A1 ఎక్స్‌ప్రెస్' అని ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. క్రీడా రంగంలోని రాజకీయాల వల్ల గొప్ప గొప్ప ఆటగాళ్లు ఎలా నష్టపోతున్నారన్నది కూడా ఇందులో చూపించారు. ఇక, ఈ ట్రైలర్ ఇప్పటికే దాదాపు మూడు మిలియన్ వ్యూస్ సాధించి, యూట్యూబ్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.