సందీప్ కిషన్ కూడా అదే దారిలో: రికార్డు స్థాయి ధరకు ‘గల్లీ రౌడీ’ డీల్ క్లోజ్
చాలా కాలంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నా.. సరైన హిట్‌ను మాత్రం అందుకోలేకపోతున్నాడు టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్. అప్పుడెప్పుడో వచ్చిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్' తర్వాత ఆ మధ్య 'నిను వీడని నీడను నేనే'తో మరో విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత కొన్ని సినిమాలు చేసిన ప్రతికూల ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, ఇది టాక్ బాగున్నా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో చిత్రంతో రెడీ అయ్యాడు సందీప్ కిషన్.
సందీప్ కిషన్ తాజా చిత్రం 'గల్లీ రౌడీ'. వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి దీన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తైంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 'గల్లీ రౌడీ' నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలో రాబోతుందట.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గల్లీ రౌడీ'.. వినోదాత్మకంగా ఉంటూనే ఎమోషనల్‌గా సాగుతుందట. విశాఖపట్నం నేపథ్యంతో సాగే ఈ సినిమాపై సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మొదట ఈ చిత్రానికి 'రౌడీ బేబీ' అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల దీన్ని మార్చేశారు. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











