For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆగిపోయిన సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ రిలీజ్: ఆరోజే పెద్ద హీరో సినిమా.. అదే కారణమా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొంత మంది త్వరగానే సక్సెస్‌లను అందుకుని స్టార్లుగా ఎదుగుతారు. కానీ, మరికొందరు మాత్రం టాలెంట్ ఉన్నా.. హిట్లు దొరకక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకడు. హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్న కేవలం మూడు నాలుగు హిట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా సక్సెస్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస పెట్టి ఎన్నో సినిమాలను చేస్తూ ముందుకెళ్తున్నాడు.

  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  అప్పుడెప్పుడో వచ్చిన 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్' మొదటి హిట్‌ను అందుకున్న సందీప్ కిషన్.. ఆ తర్వాత చాలా కాలానికి 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ, దీని తర్వాత నుంచి మళ్లీ సక్సెస్‌ను అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'ఏ1 ఎక్స్‌ప్రెస్' అనే స్టోర్స్ బేస్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. దీంతో ఈ మూవీ ఏవరేజ్‌గానే ముగిసింది. ఇక, ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు 'గల్లీ రౌడీ' అనే సినిమాతో రాబోతున్నాడు.

   Sundeep Kishans Gully Rowdy Movie Release Postpone

  వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరొందిన జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ చేసిన చిత్రమే 'గల్లీ రౌడీ'. ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీన్ని కొద్ది రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది సాధ్య పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  ఫిలిం నగర్‌లో ప్రచారం అవుతోన్న తాజా సమాచారం ప్రకారం.. సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయడం లేదట. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని చిత్ర యూనిట్ డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు వెల్లడించిందని తెలుస్తోంది. అయితే, దీనికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో అదే రోజు గోపీచంద్ నటించిన 'సీటీమార్' విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ఉండడం వల్లే 'గల్లీ రౌడీ' వాయిదా పడి ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి దీనిపై హీరోగానీ, చిత్ర యూనిట్ కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

  వినోదాత్మక చిత్రంగా రాబోతున్న 'గల్లీ రౌడీ'పై అంచనాలు బాగానే ఉన్నాయి. విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ తొలిసారి కామెడీ రోల్‌ను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, హర్షలు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Tollywood Young Hero Sundeep Kishan Now Doing Gully Rowdy Movie Under G Nageshwar Reddy Direction. This Movie Release Postponed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X