For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Gully Rowdy Twitter Review: సందీప్ కిషన్‌ మూవీకి ఊహించని రెస్పాన్స్.. ప్లస్ మైనస్‌లు ఇవే

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. కానీ, వారిలో చాలా మంది సరైన బ్రేక్ దొరకక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందులో యంగ్ హీరో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ, వాటిలో రెండు, మూడు మినహా మిగిలినవి అన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ హీరో ఎన్నో ఏళ్లుగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సందీప్ కిషన్ నటించిన చిత్రమే 'గల్లీ రౌడీ'. వినోదాత్మక చిత్రంగా రూపొందిన ఇది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ మీకోసం!

  ‘గల్లీ రౌడీ'గా వచ్చిన సందీప్ కిషన్

  ‘గల్లీ రౌడీ'గా వచ్చిన సందీప్ కిషన్

  జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన చిత్రం 'గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

  Maestro Twitter Review: మాస్ట్రోకు షాకింగ్ రిజల్ట్.. ప్లస్ మైనస్ అవే.. నితిన్ ఆ తప్పు చేయకపోతే!

  అంచనాలు అలా... బిజినెస్ భారీగా

  అంచనాలు అలా... బిజినెస్ భారీగా

  వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సందీప్ కిషన్.. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే కామెడీ మూవీలో నటించాడు. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.50 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్.

  గ్రాండ్‌గా రిలీజ్... ఏపీలో ఎక్కువగా

  గ్రాండ్‌గా రిలీజ్... ఏపీలో ఎక్కువగా

  సెకెండ్ లాక్‌డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లు ఇష్యూతో పాటు నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నాయి. దీంతో అక్కడ ఏ సినిమా కూడా గ్రాండ్‌గా రిలీజ్ కావడం లేదు. కానీ, సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' మాత్రం ఎక్కువ చోట్ల రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. రెండు రాష్ట్రాల్లో 550కి పైగా థియేటర్లలో విడుదల అయింది. అతడి కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ అని అంటున్నారు.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  ‘గల్లీ రౌడీ' మూవీకి అలాంటి టాక్

  ‘గల్లీ రౌడీ' మూవీకి అలాంటి టాక్

  ఎన్నో అంచనాలు, ఆశల నడుమ సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. అన్ని చోట్లా దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, టాక్ మాత్రం మిశ్రమంగా వచ్చింది. అంటే కొందరు బాగుందని, మరికొందరు బాలేదని అంటున్నారు.

  సినిమాలో ప్లస్.. మైనస్‌లు ఇవేనట

  సినిమాలో ప్లస్.. మైనస్‌లు ఇవేనట

  సందీప్ కిషన్ నటించిన 'గల్లీ రౌడీ' మూవీని చూసిన వాళ్లంతా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ సినిమాలో సందీప్ నటన, ఇంటర్వెల్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ మాత్రమే ప్లస్ అని చాలా మంది చెబుతున్నారు. అదే సమయంలో రొటీన్ స్క్రీన్‌ప్లే, ఔట్‌డేటెడ్ స్టోరీ, డైరెక్షన్ బాలేకపోవడం, సెకెండాఫ్ ల్యాగ్ మైనస్‌లు అని అంటున్నారు.

  బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

  Recommended Video

  Sundeep Kishan Road Show | A1 Express విజయ యాత్ర
  మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది?

  మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది?

  నాగేశ్వర్‌రెడ్డి - సందీప్ కిషన్ కాంబినేషన్‌లో వచ్చిన 'గల్లీ రౌడీ' ఆశించిన స్థాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. మరీ పాత కథ కావడానికి తోడు దర్శకత్వ లోపం ఈ సినిమాను రొటీన్ మూవీగా మార్చేశాయని అంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో ఇప్పటి వరకూ వచ్చిన టాక్.. నిరాశనే మిగిల్చేలా ఉంది. మరీ సాయంత్రానికి ఏమైనా మారుతుందా అన్నది చూడాలి.

  English summary
  Young Hero Sundeep Kishan Did Gully Rowdy Movie Under G Nageshwar Reddy Direction. Check Here To Know Audience Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X