సునీల్‌కు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు.. వివరణ ఇచ్చిన నటుడు

తెలుగు చలన చిత్ర సీమలోని కమెడియన్లలో సునీల్‌ది ప్రత్యేక స్థానం. బ్రహ్మానందం తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగే సత్తా ఉన్న నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో హీరోగా ప్రయత్నించిడం.. ఒకటి రెండు హిట్ చిత్రాలు రావడం.. ఆపై వరుస ఫ్లాపులతో సతమతమైన సునీల్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సునీల్ ఆరోగ్యంపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆస్పత్రిలో చేరిన సునీల్..

ఆస్పత్రిలో చేరిన సునీల్..


సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, అనారోగ్యంతో బాధ పడుతున్న సునీల్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రితో చేరారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే హాస్పిటల్‌లో ఎందుకు చేరాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

అనేక రకాలు రూమర్లు..

అనేక రకాలు రూమర్లు..

ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే హాస్పటల్‌‌లో సునీల్ ఏ విషయమై జాయిన్ అయి ఉంటాడా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు. సాధారణ చెకప్‌ల కోసమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడా ? లేకపోతే ఏమైనా సీరియస్ కండిషనా అనే విషయం తెలియకపోవడంతో వార్తలపై గందరగోళం నెలకొంది. ఇలా తనపై వార్తలు వస్తున్నాయని, అభిమానులు కంగారు పడుతున్నారని తెలుసుకున్న సునీల్.. స్వయంగా స్పందించాడు.

Recommended Video

Sunil Hilarious Must Watch Speech || Disco Raja Pre Release Event
ఇన్ఫెక్షన్ కారణంగానే..

ఇన్ఫెక్షన్ కారణంగానే..

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై సునీల్ స్పందిస్తూ.. తాను బాగానే ఉన్నానని, సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆస్పత్రిలో చేరానని వివరణ ఇచ్చాడు. డాక్టర్ల సూచన మేరకే హాస్పిటల్‌లో చేరారని రూమర్లకు చెక్ పెట్టాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం బిజీబిజీగా..

ప్రస్తుతం బిజీబిజీగా..

ఈ మధ్యే అల వైకుంఠపురములో చిత్రంలో కనిపించిన సునీల్.. రేపు రిలీజ్ కానున్న డిస్కోరాజాలో కూడా ఓ ముఖ్య మైన పాత్రను పోషించాడు. హీరోగా, కమెడియన్‌గా ఆకట్టుకున్న సునీల్.. ప్రతినాయకుడిగా మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. 'కలర్ ఫోటో' అనే సినిమాలో సునీల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X