‘F3’లో స్పెషల్ అట్రాక్షన్ అతడే: వరుణ్, వెంకీకి చుక్కలు చూపించబోతున్న మరో హీరో

కొన్నేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). విక్టరీ వెంకటేష్.. వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీ సృష్టించి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇంతటి సక్సెస్‌ను అందుకున్న ఈ చిత్రానికి 'F3' పేరిట సీక్వెల్ కూడా చేస్తున్నారు. తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

'F2' పెళ్లి తర్వాత వచ్చే ఫ్రస్టేషన్స్‌ను వినోదాత్మకంగా చూపించగా.. ఇప్పుడు 'F3'లో డబ్బుల వల్ల ఫ్యామిలీలో వచ్చే చిరాకులను ఫన్నీగా చూపించబోతున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మరో హీరో కమ్ కమెడియన్ సునీల్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో అతడి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట.

Sunil Role Highlight in F3 Movie

హీరోలిద్దరికీ అప్పులు ఇచ్చి.. వాళ్ల మధ్య గొడవలు పెట్టే పాత్ర అది అని తెలుస్తోంది. కొంచెం కన్నింగ్‌గా, కొంచెం పిసినారిగా ఉండే ఈ రోల్‌ను.. ఆద్యంతం నవ్వు తెప్పించే విధంగా డిజైన్ చేశాడట చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఆరంభం నుంచి శుభం కార్డు పడే వరకూ ఈ పాత్ర ఉంటుందని తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'F3' మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇటీవలే ఓ షెడ్యూల్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఫన్ రైడ్‌గా సాగే ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, మెహరీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా చేస్తున్నారు. వీళ్లతో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా కీలకమైన పాత్రను చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X