‘మోసగాళ్లు’ నుంచి పోలీసోడు.. అదిరిపోయిన బాలీవుడ్ హీరో
మంచు విష్ణు హీరోగా రాబోతోన్న తదుపరి చిత్రం మోసగాళ్లు. వరల్డ్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉత్కంఠ రేపుతోంది చిత్ర యూనిట్. ఇప్పటికే విష్ణు, కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. తాజాగా మరో పాత్రకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సునీల్ శెట్టి పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు.
విష్ణు బర్త్ డే సందర్భంగా ఆయన పోస్టర్ ని రిలీజ్ చేశారు. అర్జున్ పాత్రలో విష్ణు లుక్ ఆకట్టుకుంది. అను పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవి రెండూ బాగానే హైప్ పెంచాయి. తాజాగా సునీల్ శెట్టి పోస్టర్ కూడా జనాల్లో క్యూరియాసిటిని పెంచేలానే ఉంది. ఏసీపీ కుమార్ పాత్రలో సునీల్ శెట్టి లుక్ వైరల్ అవుతోంది.

ఐటీ స్కామ్‌ను చేధించే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి ఆకట్టుకుంటాడని టాక్. హాలీవుడ్ రేంజులో తీస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు- ఇంగ్లీష్ సహా పలుభాషల్లో రిలీజ్ చేయనున్నారు. 2020 వేసవిలో రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి జెఫ్రీ జీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











