మళ్ళీ హీరోగా యూ టర్న్ తీసుకున్న సునీల్.. స్టోరీ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్

కమెడియన్ గా అప్పట్లో ఎంతగానో క్రేజ్ అందుకున్న సునీల్ ఆ తరువాత హీరోగా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే కమెడియన్ గా సక్సెస్ అయినంత రేంజ్ లో సునీల్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. కెరీర్ మొదట్లో తప్పితే ఆ తరువాత వరుస అపజయాలు సునీల్ ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేశాయి. ఇక చాలా రోజుల తరువాత సునీల్ ఒక కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు.

 వేదాంతం రాఘవయ్యగా..

వేదాంతం రాఘవయ్యగా..

కమెడియన్ గా అరవింద సమేత సినిమాతో మళ్ళీ కొత్త తరహాలో కనిపించిన సునీల్ మళ్ళీ హీరోగా కనిపించడెమో అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారు. అదే 'వేదాంతం రాఘవయ్య' సినిమా. నేడు సినిమాకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు.

 స్టోరీ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్

స్టోరీ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్


ఇక ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందిస్తుండడం విశేషం. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఇక హరీష్ శంకర్ కథను అందించడమే కాకుండా సమర్పకుడిగా ఉండడం విశేషం. ఈ స్టార్ డైరెక్టర్ కొంచెం కొత్త తరహాలో నడుస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్..

ఫుల్ కామెడీ ఎంటర్టైనర్..

వేదాంతం రాఘవయ్య అనే టైటిల్ చాలా కొత్తగా ఉంది. ఇక హరీష్ శంకర్ ఈ కథను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రాసుకున్నట్లు టాక్ వస్తోంది. ఇంతకాలం సరైన కథలు సెలెక్ట్ చేసుకోలేక నితిన్ వరుస అపజయాలతో తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడే కథను అందిస్తూ ప్రొడక్షన్ టీమ్ లో కూడా భాగం కావడంతో సినిమాలో కంటెంట్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

సునీల్ యూ టర్న్...

సునీల్ యూ టర్న్...

2018లో సిల్లి ఫెలోస్ తరువాత సునీల్ ఇంతవరకు లీడ్ రోల్ లో కనిపించలేదు. ఇక కామెడీ పాత్రలతోనే సెటిల్ అవ్వాలని మళ్ళీ కొత్త నిర్ణయం తీసుకున్నాడని అంతా అనుకుంటున్న తరుణంలో సడన్ గా మరో యూ టర్న్ తీసుకుంటున్నాడు. మరి ఇలాగే కంటిన్యూ అవుతాడా లేక మళ్ళీ కామెడీ పాత్రలలో కూడా చేస్తాడా అనేది చూడాలి. ఇక ఈ వేదంతం రాఘవయ్య సినిమాకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని అక్టోబర్ లో ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X