'జాట్' ఫస్ట్ ఛాయిస్ డియోల్ బ్రదర్ కాదా.. మిస్ చేసుకున్న తెలుగు సూపర్ స్టార్ ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో ఇండియన్ సినిమా దగ్గర కేవలం కొన్ని కాంబినేషన్ లతోనే అంచనాలు పీక్స్ లోకి వెల్లడ మొదలవుతున్నాయి. కాగా ఇలాంటి కొన్ని ఊహించని కలయికలలో తెలుగు దర్శకులు ఇతర ఇండస్ట్రీ హీరోస్ తో సినిమాలు చేస్తూ వారికి మంచి సినిమాలు అందిస్తున్నారు. ఇలా మన తెలుగు నుంచి మెయిన్ గా హిందీ మార్కెట్ లోకి అడుగు పెట్టి అక్కడి స్టార్స్ ని మళ్ళీ ఫామ్ లోకి తెచ్చిన దర్శకుల్లో లేటెస్ట్ హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఒకరు.

మన తెలుగులో మంచి ట్రాక్ రికార్డు తనకి ఉంది. మెయిన్ గా మాస్ మహారాజ రవితేజతో చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇక క్రాక్ సినిమాతో అయితే తెలుగులో మాస్ దర్శకునిగా మంచి గుర్తింపు కూడా తాను తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి మరిన్ని మాస్ ప్రాజెక్ట్ లు సెట్ అయ్యాయి కూడా. ఇలా తన నుంచి వచ్చిన మొదటి బాలీవుడ్ చిత్రమే "జాట్".

sunny deol is not first choice for blockbuster jaat but this telugu star is

బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ ని అలరించి హిట్ గా నిలిచింది. 100 కోట్లకి పైగా గ్లోబల్ గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా సన్నీ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. కాగా అటు సన్నీ డియోల్ తమ్ముడు బాబీ డియోల్ కి కూడా మన తెలుగు దర్శకుడే లైఫ్ ఇవ్వగా ఇలా డియోల్ బ్రదర్స్ తెలుగులో తెలుగు దర్శకులతో వర్క్ చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

అయితే జాట్ సక్సెస్ తో అంతా బాగానే ఉంది కానీ లేటెస్ట్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని షాకింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేశారు. నిజానికి జాట్ కి మొదటి హీరో అసలు సన్నీ డియోల్ కాదని తెలిపారు. మరి ఈ సినిమాకి తన మొదటి హీరో ఎవరో కూడా కాదట. తన హిట్ చిత్రం వీరసింహా రెడ్డి హీరో నందమూరి బాలకృష్ణనే ఈ సినిమాకి మొదటి హీరో అని అసలు విషయం రివీల్ చేశారు.

కాగా క్రాక్ సెన్సేషనల్ హిట్ తర్వాత వెంటనే బాలయ్యకి జాట్ కథని గోపీచంద్ చెప్పడం బాలయ్య ఓకే చేయడం కూడా జరిగిందట. కానీ అప్పటికే బాలయ్య అఖండ తో కూడా భారీ హిట్ కొట్టడంతో జాట్ కాదు కానీ ఏదన్నా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా చేద్దాం అని చెప్పడంతో అపుడు వీరసింహా రెడ్డి కథ సిద్ధం చేసి చెప్పగా దానిని కూడా ఓకే చేశారట.

సో అలా వీరసింహా రెడ్డి సెట్ అయ్యి జాట్ పక్కకి వెళ్లిందట. అయితే దానినే మాస్ మహారాజ రవితేజతో అనుకున్నట్టుగా టాక్ వచ్చింది కానీ అది కాస్తా ఫైనల్ గా సన్నీ డియోల్ దగ్గరకి వెళ్ళింది. మరి తనతో కూడా చేసిన ఈ మాస్ ప్రయత్నం హిందీలో కూడా మంచి విజయాన్ని సాధించింది. అలాగే దీనికి కూడా పార్ట్ 2 గా జాట్ 2 ని మేకర్స్ సన్నీ డియోల్ తోనే అనౌన్స్ చేయడం విశేషం.

More from Filmibeat

Read more about: Jaat sunny deol balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X