Just In
- 37 min ago
ధోనీపై స్టార్ హీరో కామెంట్.. ఆయనో ‘దబాంగ్’ ప్లేయర్’ అంటూ!
- 1 hr ago
నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
- 2 hrs ago
ఫైటర్ హీరోయిన్ ఫిక్స్: విజయ్‌కు జోడీగా స్టార్ డాటర్.. అడ్వాన్స్‌గా అంత ఇచ్చారా.!
- 2 hrs ago
కుమ్మేసిన వెంకీమామ.. తొలి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందో తెలుసా?
Don't Miss!
- Finance
నేటి నుంచి NEFT ద్వారా 24x7 ట్రాన్సుఫర్, మీరు తెలుసుకోవాల్సిన అంశాలు...
- News
Hyderabad: ఉర్దూ వర్శిటీలో మంటలు: రాత్రంతా రోడ్డు మీదే..సెమిస్టర్ బాయ్ కాట్: హెచ్ సీయు మద్దతు
- Technology
టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్ ఎలా ఉందొ చూడండి
- Automobiles
పేరు మార్చుకోనున్న ఆరు సీట్ల ఎంజి హెక్టర్
- Sports
నేచురల్ గేమ్ అంటూ ఏమీ లేదు.. పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం: పంత్
- Lifestyle
మార్నింగ్ వర్కవుట్సా లేదా ఈవినింగ్ వర్కవుట్సా? రెండింటిలో ఏది బెటరో తెలుసా..?
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
సన్నీలియోన్ అన్నారా నేరుగా అక్కడికే.. అలా ఉన్నాయి లింక్స్! రాజ్యమేలుతున్న అశ్లీలం!
కొన్ని రంగాల్లో కొందరు ప్రత్యేకమైన వ్యక్తులుంటారు. భారత క్రికెట్‌లో చుస్తే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, హర్మన్‌ప్రీత్ కౌర్.. బాడ్మింటన్ ఆటలో పీవీ సింధు.. అలాగే గ్లామర్ రంగంలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరందరికి మన దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తమ తమ అభిమాన క్రికెటర్లు, సినీతారల సమాచారం కోసం అభిమానులు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మోసాలు జరుగుతున్నాయట.

నకిలీ వెబ్‌సైట్లకు లింకులు
అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల సమాచారం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు నకిలీ లింకులు దర్శనమిస్తున్నాయి. వాటిని ఓపెన్ చేస్తే అవి అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లకు దారి తీస్తుంటాయి. ఇంటర్నెట్ వాడకంపై అంతగా అవగాహన లేనివారు ఆ లింక్‌లపై క్లిక్ చేసి ప్రమాదంలో పడుతున్నారు. ఈ క్రమంలో ధోనీ, సచిన్, సన్నీ లియోన్‌ల గురించి సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్ వెబ్‌సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయి.

అత్యంత ప్రమాదకర వ్యక్తి ధోనీ, సన్నీలియోన్
ఈ నేపథ్యంలోనే ధోనీ ఇంటర్నెట్ సెర్చ్‌లో అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారిపోయాడు. ధోనీ పేరుతో సమాచారం వెతుకుతున్నప్పుడు అత్యంత ఎక్కువగా మాలీసియస్ వెబ్‌సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాను ఓ నివేదిక సిద్ధం చేసింది. సచిన్, సన్నీ లియోన్, రాధికా ఆప్టె, శ్రద్ధా కపూర్, పీవీ సింధు లాంటి పేర్లు ఇందులో ప్రధానంగా ఉండటం గమనార్హం.

సన్నీలియోన్ కంటే ధోనీనే డేంజర్
ధోనీ, సచిన్ ప్రమాదకర సెలెబ్రిటీల జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నారు. బిగ్‌బాస్-8 విన్నర్ గౌతమ్ గులాటీ, బాలీవుడ్ బాంబ్ సన్నీ లియోన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. రాధికా ఆప్టే, శ్రధ్దా కపూర్, పీవీ సింధు, హర్మన్‌ప్రీత్ కౌర్, క్రిస్టియానో రొనాల్డోలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితా చూస్తే సన్నీలియోన్ కన్నా డేంజర్ పర్సన్ ఎంఎస్ ధోనీనే.

ఇలా అయితే చాలా ప్రమాదం
సాధారణంగా నెటిజన్లు క్రీడలు, సినిమాలు, టీవీ షోల గురించి ఎక్కువగా వెతుకుతుంటారు. సెలబ్రెటీల ఫోటోలు, వీడియోల కోసం బాగా సెర్చ్ చేస్తారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్‌లను క్రియేట్ చేసి వారిని ఆకర్షించేలా చేస్తున్నారు. అవి ఓపెన్ చేస్తే అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లు ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ చేయడంతో కొన్నిసార్లు వారి మొబైల్/కంప్యూటర్ వైరస్/హ్యాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని మెకాఫీ పేర్కొంది.

అలాంటి వాటి జోలికి పోవద్దు.. సురక్షితంగా ఉంటే!
అందరికీ ప్రమాదకర వెబ్‌సైట్లపై అవగాహన ఎక్కువగా ఉండదు. నెటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారిక, సురక్షితమైన వెబ్‌సైట్ల నుంచే సమాచారం తీసుకోవాలి. డివైజుల్లో భద్రతకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి అని మెకాఫీ ఇండియా ఎండీ వెంకట్ కృష్ణాపుర్ తెలిపారు.