twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏదో! చూపించా.. కానీ ఇలా పోలీసుల దాకా వెళ్తుందనుకోలేదు.. క్షమించమన్న సన్నీలియోన్

    |

    సన్నీలియోన్ సెల్ నెంబర్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఓ సినిమా సన్నివేశంలో భాగంగా సన్నీలియోన్ తన సెల్ నెంబర్ చూపెడుతుంది. అయితే ఆ తర్వాత అది కాస్త పెద్ద రచ్చకు దారితీసింది. ఆ రచ్చకు కారణం సన్నీ చూపించిన ఆ ఫోన్ నెంబర్. ఆ నెంబర్ వేరొక వ్యక్తిది కావడంతో.. అతనికి కాల్స్ రావడం, ఆయన మీడియా ముందుకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై సన్నీలియోన్ స్పందించింది. ఇంతకీ ఈ ఉదంతంపై ఆమె ఎలా రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..

     పోర్న్ వీడియోల నుంచి వెండితెరపైకి

    పోర్న్ వీడియోల నుంచి వెండితెరపైకి

    పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగొందిన సన్నీలియోన్ ఆ తర్వాత వెండితెరపై కాలుమోపింది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న ఈమె.. ఇటీవలే ‘అర్జున్ పటియాలా' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సన్నీతో పాటు దిల్జీత్‌ దొసాన్జ్‌, వరుణ్‌ శర్మ, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో క‌నిపించారు.

    అర్జున్ పటియాలా.. ఫోన్ నెంబర్

    అర్జున్ పటియాలా.. ఫోన్ నెంబర్

    అర్జున్ పటియాలా చిత్రం విడుదలైన రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రదర్శితమవుతోంది. అంతా మంచిగానే ఉందనుకుంటున్న సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ సన్నివేశంలో తనకు కాల్ చేయమని మరో నటుడికి చెబుతుంది. ఆ సమయంలో ఓ ఫోన్ నంబర్ కూడా చూపిస్తుంది. దీంతో అది నిజంగానే సన్నీ లియోన్ నెంబర్ అనుకున్న ప్రేక్షకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు.

    27 ఏళ్ల యువకుడు.. పోలీస్ ఫిర్యాదు

    27 ఏళ్ల యువకుడు.. పోలీస్ ఫిర్యాదు

    సన్నీ చెప్పిన నెంబర్ ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్‌ అగర్వాల్‌ది. సన్నీ లియోన్ చెప్పడంతో చాలా మంది ఆయనకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండడంతో పునీత్ మీడియా ముందుకు వచ్చాడు. చాలామంది ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, తనకు ఈ పరిస్థితిని కల్పించిన ‘అర్జున్ పటియాలా' యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

     సారీ చెప్పక తప్పలేదు

    సారీ చెప్పక తప్పలేదు

    ఈ ఉదంతం చూసిన సన్నీలియోన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సారీ చెప్పింది. అర్జున్ పటియాలా సినిమాలో ఫోన్ నెంబర్ చూపించిన విషయమై స్పందించిన ఆమె.. ఇలా జరుగుతుందని ఊహించలేదని, జరిగిన దానికి సారీ చెబుతున్నానని పేర్కొంటూ తెగ ఫీలై పోయింది సన్నీ.

    English summary
    A man from Delhi has complained to the police that he has been receiving hundreds of phone calls from fans of Bollywood actress Sunny Leone after his number was used in her recent movie Arjun Patiala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X