Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏదో! చూపించా.. కానీ ఇలా పోలీసుల దాకా వెళ్తుందనుకోలేదు.. క్షమించమన్న సన్నీలియోన్
సన్నీలియోన్ సెల్ నెంబర్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఓ సినిమా సన్నివేశంలో భాగంగా సన్నీలియోన్ తన సెల్ నెంబర్ చూపెడుతుంది. అయితే ఆ తర్వాత అది కాస్త పెద్ద రచ్చకు దారితీసింది. ఆ రచ్చకు కారణం సన్నీ చూపించిన ఆ ఫోన్ నెంబర్. ఆ నెంబర్ వేరొక వ్యక్తిది కావడంతో.. అతనికి కాల్స్ రావడం, ఆయన మీడియా ముందుకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై సన్నీలియోన్ స్పందించింది. ఇంతకీ ఈ ఉదంతంపై ఆమె ఎలా రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..
పోర్న్ వీడియోల నుంచి వెండితెరపైకి
పోర్న్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగొందిన సన్నీలియోన్ ఆ తర్వాత వెండితెరపై కాలుమోపింది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న ఈమె.. ఇటీవలే ‘అర్జున్ పటియాలా' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సన్నీతో పాటు దిల్జీత్ దొసాన్జ్, వరుణ్ శర్మ, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
అర్జున్ పటియాలా.. ఫోన్ నెంబర్
అర్జున్ పటియాలా చిత్రం విడుదలైన రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రదర్శితమవుతోంది. అంతా మంచిగానే ఉందనుకుంటున్న సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ సన్నివేశంలో తనకు కాల్ చేయమని మరో నటుడికి చెబుతుంది. ఆ సమయంలో ఓ ఫోన్ నంబర్ కూడా చూపిస్తుంది. దీంతో అది నిజంగానే సన్నీ లియోన్ నెంబర్ అనుకున్న ప్రేక్షకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు.
27 ఏళ్ల యువకుడు.. పోలీస్ ఫిర్యాదు
సన్నీ చెప్పిన నెంబర్ ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్ అగర్వాల్‌ది. సన్నీ లియోన్ చెప్పడంతో చాలా మంది ఆయనకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండడంతో పునీత్ మీడియా ముందుకు వచ్చాడు. చాలామంది ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, తనకు ఈ పరిస్థితిని కల్పించిన ‘అర్జున్ పటియాలా' యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సారీ చెప్పక తప్పలేదు
ఈ ఉదంతం చూసిన సన్నీలియోన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సారీ చెప్పింది. అర్జున్ పటియాలా సినిమాలో ఫోన్ నెంబర్ చూపించిన విషయమై స్పందించిన ఆమె.. ఇలా జరుగుతుందని ఊహించలేదని, జరిగిన దానికి సారీ చెబుతున్నానని పేర్కొంటూ తెగ ఫీలై పోయింది సన్నీ.