సన్నీలియోన్ అఫీషియల్ స్టేట్‌మెంట్.. వేలం వేయనున్నట్లు ప్రకటించేసింది
ఈ మధ్యకాలంలో ఎక్కువ మొత్తంలో సెలెబ్రిటీలు సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. తమకు గొప్ప మనసుందని చాటుకుంటూ ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్నారు. ఇది ఎంతో శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఈ లిస్టులో మాజీ పోర్న్ స్టార్, నేటి అందాల తార సన్నీలియోన్ చేరిపోయింది. క్యాన్సర్ బాధితుల కోసం తనవంతు సాయం అందించాలని ముందుకు వచ్చింది.
ఇందుకోసం తను వేసిన పెయింటింగ్స్‌ను వేలానికి పెడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది సన్నీలియోన్. ''క్యాన్సర్ బాధితుల కోసం నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. ఇందుకోసం పెయింటింగ్స్ వేశాను. వాటిని వేలానికి పెడుతున్నాను. ఆ వేలంలో వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితులకు అందజేస్తాను'' అని పేర్కొంది సన్నీ. ఈ పెయింటింగ్స్ వేసినప్పుడే క్యాన్సర్ బాధితుల కోసం ఆలోచించానని పేర్కొన్న ఆమె.. మీరు కూడా క్యాన్సర్ బాధితుల కోసం తోచిన సాయం చేయండని తన పోస్ట్ ద్వారా తెలిపింది.

క్యాన్సర్ బాధితుల కోసం సన్నీలియోన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, క్యాన్సర్‌తో పోరాడుతున్న పేదవారికి ఎవరికి తోచినంత వారు సాయం చేయమని కోరడం చూసి ఆమెపై పెద్ద ఎత్తున ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. మనసున్న మహారాణి సన్నీలియోన్ అని, మిగిలిన హీరోయిన్లు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక సన్నీ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన 'అర్జున్ పాటియాలా' సినిమాలో మెరిసిన సన్నీలియోన్.. ప్రస్తుతం 'స్ల్పిట్స్ విల్లా సీజన్ 12' రియాల్టీ షోతో బిజీగా ఉంది. హర్రర్, కామెడీ నేపథ్యంతో సాగే 'కోకాకోలా' సినిమాలో కూడా ఆమె నటించనుంది. ఇకపోతే తెలుగులో ఆమె చేసిన డియ్యో.. డియ్యో మ్యాజిక్ ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తూనే ఉంది. రాజశేఖర్ సరసన గరుడ వేగ సినిమాలో ఈ పాటతో ఉర్రూతలూగించింది సన్నీ.


Click it and Unblock the Notifications











