మోదీనే పక్కకు నెట్టిన సన్నీలియోన్.. సెక్సీతార కోసం ఓ రేంజ్ సెర్చింగ్
ఒకప్పటి సెక్సీతార, నేటి బాలీవుడ్ భామ సన్నీలియోన్ క్రేజ్ మాములుగా లేదండీ బాబు. నెట్టింట జనమంతా ఆమె కోసమే వెతుకుతున్నారు. భారత ప్రధాని మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ లాంటి వారి కంటే ఎక్కువగా సన్నీకి సంబందించిన వీడియోలు, అప్‌డేట్స్ కోసం వెతుకుతున్నారట నెటిజన్లు. అదేనండీ గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న పేరు సన్నీలియోన్ అని తాజాగా కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

పోర్న్ స్టార్‌గా అశేష పాపులారిటీ.. భారీ డిమాండ్
రసిక ప్రియుల ఆరాధ్య దైవం సన్నీలియోన్. పోర్న్ స్టార్‌గా అశేష పాపులారిటీ సంపాదించిన ఈమె.. ఆ తర్వాత పోర్న్ సినిమాలు వదిలేసి వెండితెర బాట పట్టింది. ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చింది. మెల్లగా టాలీవుడ్ వైపు చూసిన ఈ సెక్సీ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన 'కరెంట్ తీగ' లో నటించి మెప్పించింది. ఆ తర్వాత డియ్యో డియ్యో అంటూ ఐటెం సాంగ్‌కే కొత్త వన్నె తెస్తూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసింది. దీంతో సన్నీకి తెలుగులోనూ మంచి డిమాండ్ ఏర్పడింది.

పోర్న్ స్టార్ పైగా అందాల విందు
మొదట పోర్న్ చిత్రాల్లో ఓ వెలుగు వెలగటం, ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులకు అందాల విందులివ్వడం కారణంగా సన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమె శృంగార వీడియోలు, సినిమాలకు సంబందించిన అప్‌డేట్స్ కోసం పెద్ద ఎత్తున గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారట నెటిజన్లు. దీంతో గూగుల్ ట్రెండ్స్ అనలైటిక్స్‌లో సన్నీ మొదటి స్థానంలో నిలిచింది.

మోడీ, సచిన్‌లను మించేసి
సన్నీలియోన్ కోసం నెటిజన్లు తీవ్రంగా సెర్చ్ చేస్తున్నారని గూగుల్ తెలిపింది.
దేశ ప్రధాని మోడీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరోలు షారుఖ్, అమీర్, సల్మాన్ ఖాన్ ల కంటే ఎక్కువగా సన్నీ లియోన్ కోసం వెతుకులాట జరుగుతోందట. ఇదిలాఉంటే గతంలో కూడా ఓ సారి కేరళలో సన్నీలియోన్ ని చూడటం కోసం లక్షలాది మంది రావడంతో ఆమెకున్న క్రేజ్ బయటపడింది.

కెరీర్ గురించి సన్నీ
పోర్న్ సినిమాలు పూర్తిగా వదిలేసినా సన్నీ సినిమానే తన ప్రాణమని, సినిమా కోసం నిద్రలేని రాత్రులు గడిపేందుకు సిద్ధమేనని అంటోంది. కథానాయికగా రాణించాలని ఉంది, అందుకోసం సమయం లేకున్నా తీరిక చేసుకొని కష్టపడతానని చెబుతోంది సన్నీ. తాను ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, చేయబోయే ప్రాజెక్టుల గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నానని అంటున్న ఆమె.. నటించడమే తన అల్టిమేట్ గోల్ అని చెబుతోంది. ఈ లెక్కన్న మున్ముందు సన్నీ క్రేజ్ ఇంకెంతలా పెరిగిపోతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











