ప్రభాస్ సోదరుడిగా బాలీవుడ్ హీరో: క్రేజీ ప్రాజెక్టులో భాగమైన మరో స్టార్
పేరుకు టాలీవుడ్ హీరోనే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' వల్లే అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీని తర్వాత చేసిన 'సాహో' కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్‌గా నిలవడంతో బాలీవుడ్‌లో అతడు హాట్ టాపిక్ అయిపోయాడు. దీంతో హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓం రౌత్ యంగ్ రెబెల్ స్టార్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'ఆదిపురుష్' అనే సినిమాను ప్రకటించారు.
ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత 'ఆదిపురుష్'లో నటించనున్నాడు యంగ్ రెబెల్ స్టార్. టి-సిరీస్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రాబోతుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారన్న దానిపై కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి.

'ఆదిపురుష్'లో లక్ష్మణుడి పాత్రను పలానా హీరో చేస్తాడని పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరో సన్నీ సింగ్ చేయబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. 'పాఠ్‌శాల' అనే మూవీతో హీరోగా పరిచయం అయిన అతడు.. 'ఆకాశ్‌వాణీ', 'సోను కె టిటు కి స్వీటీ', 'జై మమ్మీ జీ' వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించాడు. ఈ కారణంగానే దర్శకుడు ఓం రౌత్ అతడిని లక్ష్మణుడి పాత్రకు ఎంపిక చేశాడని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











