ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్‌కు సీక్వెల్ వచ్చేస్తోంది.. ఈసారి లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్!
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ అయింది. ముఖ్యంగా క్రైమ్, హిస్టారికల్, హర్రర్ థ్రిల్లర్ చిత్రాలను చూసేందుకు అంతా ఆసక్తి కనబరుస్తున్నారు. అది అర్థం చేసుకున్న డైరెక్టర్లు కూడా అలాంటి కథలనే రాసుకుంటూ సూపర్ డూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. వాటికి ఎక్కువగా రెస్పాన్స్ వస్తే వెంటనే సీక్వెల్ చిత్రాలు తీస్తూ మరింత క్రేజ్ పెంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్ తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ను తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2022లో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే సుద్దాల అశోక్ తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. అయితే సంపత్ నంది ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఆగస్టు 26వ తేదీన 2022లో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో కనిపించగా.. వశిష్ట సింహా, సాయిరోనక్, పూజిత పొన్నాడ, నాగమహేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీసుకు రావాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. అదే విషయాన్ని మూవీ టీం ప్రకటించింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రానికి టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఓదెల2 అనే టైటిల్ ను ఖరారు చేసి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారో కూడా వివరించారు.
అయితే పార్ట్ 1లో హెబ్బా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేయగా... ఈసారి మాత్రం ఆమె స్థానంలోకి ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకు వచ్చారు. టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న తొలి క్రైమ్ థ్రిల్లర్ ఇదే. మరి తమన్నా హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు, ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనే దానిపై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు.

కానీ కచ్చితంగా పార్ట 1 కంటే కూడా మరింత ఆసక్తికరంగా ఉండేలా పార్ట్ 2 ను తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవాకశం ఉంది. అలాగే నటీనటుల గురించి కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వనున్నారు. చూడాలి మరి ఎవరెవరికి ఈ సినిమాలో అవకాశం దక్కుతుందనేది.


Click it and Unblock the Notifications











