Krishna Health Update: మరో సమస్యతో బాధపడుతున్న కృష్ణ.. చుట్టూ చేరిన టాప్ డాక్టర్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపును అందుకున్న మంచి నటుడు ఘట్టమనేని కృష్ణ గారు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయమే కుటుంబ సభ్యులు ఆయనను కాంటినెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయగా పరిస్థితి పై వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం మరోసారి ఆయన ఆరోగ్య విషయంలో మరొక అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

త్వరగా కోలుకోవాలని..

త్వరగా కోలుకోవాలని..

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి ఘట్టమననేని కృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానే కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా కృష్ణ గారి గురించి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అయితే వైద్యులు కూడా ప్రస్తుతం పరిస్థితి అయితే నిలకడగా లేదు అని ఆయన పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉంది అని కూడా మొదటి బులిటెన్ లో వివరణ అయితే ఇచ్చారు.

హాస్పిటల్ లోనే కృష్ణ ఫ్యామిలీ

హాస్పిటల్ లోనే కృష్ణ ఫ్యామిలీ

కృష్ణ గారు గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత ఆయనను హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఇక అప్పటినుంచి కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారు. మహేష్ బాబు కూడా తండ్రి గురించి తెలియగానే ఇతర పనులు అన్నిటిని కూడా పక్కనపెట్టి హాస్పిటల్ కు వచ్చేసాడు.

 మరో సమస్య

మరో సమస్య

వైద్యులు కృష్ణ గారు హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి కూడా ఆయనను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్ లో ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి చాలా కష్టంగానే ఉంది అని అన్నారు. అయితే మొదట గుండెపోటుతో హాస్పిటల్ లో జాయిన్ అయినా కృష్ణగారికి ఇప్పుడు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అని కూడా వివరణ ఇచ్చారు. ఇంకా క్రిటికల్ గానే ఉంది అని కూడా చెబుతున్నారు.

టాప్ 8 డాక్టర్స్ పర్యవేక్షణ

టాప్ 8 డాక్టర్స్ పర్యవేక్షణ

కృష్ణ గారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. ఇక కృష్ణ గారి ఆరోగ్య విషయంపై మొత్తం కాంటినెంట్ లో ఉన్న టాప్ 8 మంది డాక్టర్లు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం ఆయన ఆరోగ్య స్థితిపై ఒక క్లారిటీకి వస్తూ వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు మా శక్తికి మించి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఇక శరీరం సహకరిస్తుందా లేదా అనే విషయంలో మాత్రం ఎవరు ఊహించలేనిది అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అని కూడా వారు వివరణ ఇచ్చారు.

 అభిమానుల ప్రార్థనలు

అభిమానుల ప్రార్థనలు

ఇక సూపర్ స్టార్ కృష్ణ వీలైనంత త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలి అని రెండు రాష్ట్రాల్లో ఉన్న ఘట్టమనేని అభిమానులు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గడిచిన 24 గంటల తర్వాత మరొక హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X