Krishna No More: ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ హీరో.. ఇండియన్ సినిమాకు టెక్నాలజీని పరిచయం చేసిన సూపర్‌‌స్టార్

టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూయడం తెలుగు ప్రజలందరికీ మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి కూడా తీరని లోటు అని చెప్పాలి. ఇక ఆయన మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ కేవలం ఒక నటుడిగానే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన నిర్మాత అని కూడా చెప్పవచ్చు. ఆయన మొదటి సారి ఎన్నో సినిమాలకు టెక్నికల్ గా ప్రాణం పోశారు. సినిమా ఇండస్ట్రీకి ఒక సరికొత్త రూపాన్ని తీసుకువచ్చారు. ఇక ఆ విధంగా ఆయన చేసిన ప్రయోగాలు అలాగే మొదటి పాన్ వరల్డ్ సినిమా విశేషాల్లోకి వెళితే..

ట్రెండ్ సెట్ చేసిన హీరో

ట్రెండ్ సెట్ చేసిన హీరో

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో పద్మాలయ స్టూడియోస్ లో చాలా సినిమాలను నిర్మించారు. ఇక ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా టెక్నికల్ గా ఒకప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేసినవే. ప్రతి సినిమాలో కూడా ఆయన ఏదో ఒకటి టెక్నాలజీని హైలెట్ చేస్తూ వచ్చారు. అలాగే దాదాపు అన్ని జానర్స్ కూడా ఆయన ట్రై చేశారు. మైథిలాజికల్ డ్రామా ఫాంటసీ యాక్షన్ స్పై అండ్ హిస్టారికల్ సినిమాలు కూడా చేసిన అతి కొద్ది మంది హీరోల్లో ఆయన ఒకరు.

 టెక్నీకల్ గా మొదటి సినిమాలు

టెక్నీకల్ గా మొదటి సినిమాలు


ఇక ఆయన హీరోగా నటించి నిర్మించిన సినిమాలు తెలుగు చిత్రపరిశ్రమ ను టెక్నికల్ గా ఒక సరికొత్త రూపాన్ని తీసుకువచ్చాయి. ముఖ్యంగా మొదటి సినిమాస్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజును 1974లో ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. అలాగే ఫస్ట్ ఈస్ట్ మాన్ కలర్ ను 1982లో ఈనాడు సినిమా ద్వారా తీసుకువచ్చారు. ఇక మొట్టమొదటి 70MM ఫిలీంగా సింహాసనం 1986 లో వచ్చింది.

గూఢచారి సినిమాలు

గూఢచారి సినిమాలు

ఇక ఫస్ట్ డిటిఎస్ ఫిలిమ్ గా తెలుగువీర లేవరా 1995లో రిలీజ్ అయింది. ఆయన కౌబాయ్ లాంటి సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. అప్పట్లో గూడచారి 116 బాక్సాఫీస్ వద్ద ఒక రికార్డును క్రియేట్ చేసింది. ఏజెంట్ గోపి, రహస్య గూడాచారి, గూడచారి 117 సినిమాలతో ఆయన సృష్టించిన రికార్డులు అన్నీ కావు భిన్నమైన ప్రయోగాలకు అప్పట్లో ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు.

దర్శకత్వంలో కూడా

దర్శకత్వంలో కూడా

ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశారు. శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు.. సినిమాలను కూడా ఆయన తెరపైకి తీసుకువచ్చిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తన సినిమాల ద్వారానే కొడుకు మహేష్ బాబును పరిచయం చేశాడు. కృష్ణ దాదాపు 17 సినిమాలను డైరెక్ట్ చేశాడు.

ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా..

ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా..

ఇక కృష్ణ గారు తెలుగులో ఎవరు మర్చిపోలేని సినిమాలలో మోసగాళ్లకు మోసగాడు సినిమా ఒకటి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా ఫ్యాన్ వరల్డ్ సినిమాలు ఉంటున్నారు కానీ అప్పట్లో ఆ సినిమా ఫ్యాన్ వరల్డ్ మూవీగా విడుదల అయింది. KSR దాస్ దర్శకత్వంలో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు యాక్షన్ ఫిలిం గా తెరకెక్కింది. ఈ సినిమాను ఇంగ్లీషులో ట్రెజర్ హంట్ పేరుతో విడుదల చేశారు. అలాగే తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేయగా మంచి గుర్తింపును అందుకుంది. వివిధ దేశాల్లో రష్యన్ కంట్రీస్ లలో కూడా అప్పట్లో ఈ సినిమాను విడుదల చేశారు. అలాగే పలు సినిమా ఫెస్టివల్స్ లో ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X