twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Super Star Krishna Death.. మరణానికి కారణాలు ఇవే.. మెడికల్ రిపోర్టులో వైద్యులు చెప్పినదేమిటంటే?

    |

    విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో సినీ లోకాన్ని ఆలరించిన సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. గుండెపోటుకు గురైన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో కోట్లాది మంది సినీ అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ప్రముఖ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచిన ఆయన పార్థీవదేహాన్ని తన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా కృష్ణ మరణానికి కారణం ఇదే అంటూ వైద్యులు వెల్లడించిన రిపోర్టులో ఏమున్నదంటే?

    టాప్ డాక్టర్స్‌ ట్రీట్‌మెంట్‌తో

    టాప్ డాక్టర్స్‌ ట్రీట్‌మెంట్‌తో

    సూపర్ స్టార్ కృష్ణ ఆదివారం గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హాస్పిటల్‌లో చేర్పించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు ఎనిమిది మందితో కూడిన అత్యంత నైపుణ్యం ఉన్న వైద్యులు చికిత్స అందించారు. కృష్ణను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు.

    24 గంటల్లో ఆయన పరిస్థితి

    24 గంటల్లో ఆయన పరిస్థితి

    కృష్ణ మరణం తర్వాత హాస్పిటల్ నిర్వాహకులు మెడికల్ రిపోర్టును మీడియాకు రిలీజ్ చేశారు. మా హాస్పిటల్‌కు తీసుకొచ్చిన తర్వాత 24 గంటలపాటు ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు కార్డియాక్ అరెస్ట్‌కు సంబంధించిన ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించాం. ఆ తర్వాత ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స కొనసాగించాం అని కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

    హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ

    హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ

    కృష్ణ గారు అపస్మారక స్థితిలోనే హాస్పిటల్‌కు వచ్చారు. ఆయన పరిస్థితి అప్పటికే విషమంగా ఉంది. పలు అవయవాలు పనిచేయలేదు. హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీకి గురయ్యారని గుర్తించాం. అందుకోసం క్రిటికల్ కేర్ ట్రీట్‌మెంట్ ద్వారా పలు విభాగాలకు చెందిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

    ఫ్యామిలీ మెంబర్స్ కోరిక మేరకు..

    ఫ్యామిలీ మెంబర్స్ కోరిక మేరకు..

    కృష్ణ గారి ఆరోగ్యం, అందిస్తున్న చికిత్స గురించి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకొన్నాం. అయితే కృష్ణ గారి దేహం చికిత్సకు స్పందించలేదు. అయితే చివరి క్షణాల్లో తీవ్రమైన చికిత్సతో కృష్ణ గారిని బాధ పెట్టకూడదని కుటుంబ సభ్యులు భావించారు. ఆయన దేహాన్ని కష్టపెట్టకూడదని ట్రీట్‌మెంట్‌ను ఆపివేయాలని సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి చెప్పారు.

    కృష్ణ ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించకండి

    కృష్ణ ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించకండి

    కృష్ణ గారి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఈ విషాదం వేళ మనోధైర్యం కూడగట్టుకోవాలని, వారికి మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి తగినంత ప్రైవసీ ఇవ్వాలని ప్రతీ ఒక్కరికి మనవి చేస్తున్నాం. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆయన మరణం గురించి వివరాలు, సమాచారాన్ని మేము వెల్లడించబోము అని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

    English summary
    Super Star Krishna passed away due to Cardiac Arrest at the age of 80. Here is Continental Hospitals revealed reason's behind Mahesh Babu Father's demise
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X