Super Star Krishna అంత్యక్రియలకు ఆలస్యంగా కృష్ణ పెద్ద మనవడు.. కారణం ఏమిటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా ఈ ఘటన ఘట్టమనేని కుటుంబంలో తీరని విషాదంగా మిగిలింది. తెలుగు చిత్ర పరిశ్రమంలోనే అగ్ర ప్రముఖులు రాజకీయ నాయకులు అందరూ కూడా కృష్ణకు ప్రత్యేకంగా నివాళులర్పించారు. అయితే ఒక ఘట్టమనేని ముడవతరం పెద్ద వారసుడు మాత్రమే కృష్ణను ఆకరిసారి చూసుకోలేకపోయాడు. అతను అమెరికా నుంచి హఠాత్తుగా నిన్న రాత్రి రావడం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ వార్త గురించి తెలియగానే..

ఆ వార్త గురించి తెలియగానే..

సూపర్ స్టార్ కృష్ణ సోమవారం రోజు గుండె నొప్పితో హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే గంటల తరబడి వైద్యులు ఆయనను రక్షించేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ గుండెపోటు ప్రభావం మిగతా అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపడంతో ఆయన మంగళవారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆ వార్త గురించి తెలియగానే విదేశాల్లో ఉన్న కొంతమంది కుటుంబ సభ్యులు కూడా హుటాహుటిన బయలుదేరి ఇండియాకు వచ్చేశారు.

తీరని విషాదం

తీరని విషాదం

ఇక బుధవారం రోజు ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంచనాలతో సూపర్ స్టార్ కృష్ణకు ఘనంగా వీడ్కోలు పలికారు. మహేష్ బాబు తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన కొన్ని రోజులకే తండ్రికి కూడా అదే తరహాలో కన్నీటితో వీడ్కోలు పలికాడు. మహేష్ మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది తీరని విషాదంగా మిగిలింది.

చాలాకాలం తర్వాత

చాలాకాలం తర్వాత

సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందినట్లు తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలామంది సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. చాలాకాలం తర్వాత ఒక స్టార్ హీరో కోసం దాదాపు ఇండస్ట్రీలోని అగ్ర ప్రముఖులు అందరు కూడా తరలివచ్చారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనకు నివాళులర్పించారు.

రమేష్ బాబు తనయుడు

రమేష్ బాబు తనయుడు

ఇక మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా అమెరికాలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అతను పరిస్థితి గురించి తెలుసుకుని వెంటనే ఇండియా వచ్చేసాడు. ఇక అదే తరహాలో రమేష్ బాబు తనయుడుని కూడా ఇండియాకు రప్పించాలని అనుకున్నారు కానీ అనుకోని విధంగా అతను రాలేకపోయాడు.

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడు

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడు

రమేష్ బాబు తనయుడు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడు జయకృష్ణ తాత కోరిక మేరకు నటుడు అవ్వాలి అనే డిసైడ్ అయ్యాడు. అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ తన ఖర్చులతోనే అమెరికా పంపించి అక్కడే ప్రత్యేకంగా అతనికి శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. తాత గారి చేతుల మీదుగానే హీరోగా లాంచ్ అవ్వాలని జయకృష్ణ అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆయన మృతి చెందడంతో జయకృష్ణ ఇంటికి రాగానే తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యుల నడుమ మనోవేదనకు గురయ్యాడు. ఇక అతన్ని ఇప్పుడు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి లాంచ్ చేయనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X