సరిలేరుపై సూపర్ స్టార్.. ఆ సీన్లపై కృష్ణ రియాక్షన్.. నిర్మాత ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కొంత నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన కమర్షియల్ అంశాలు ఫుల్లుగా ఉండటం, సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉండటంతో కలెక్షన్లకు ఏ ఢోకా లేదని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో మహేష్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్సులు, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింటిలో వేరియేషన్ చూపించడంతో సగటు ప్రేక్షకుడికి సైతం కొత్తగా అనిపిస్తుంది.

ముందు నుంచీ అదే మాట..
సరిలేరు చిత్రంలో మహేష్ సరికొత్తగా కనిపిస్తారని టీమ్ అంతా చెప్పుకొచ్చింది. ఈ మూవీ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ఇంతకు ముందు సినిమాలన్నీ ఒకెత్తు.. ఈ సినిమా ఒకెత్తు అని స్వయంగా మహేష్ బాబే అన్నాడు. అయితే ఆ మాటలన్నీ నిజమయ్యాయి. డ్యాన్సుల్లో అయితే ఇతను మునుపటి మహేష్ బాబేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేసేలా ఉన్నాడు. ఇవన్నీ మహేష్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేవే.

మెచ్చుకున్న సోదరి..
సరిలేరు చిత్రంపై మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని స్పందించింది. మహేష్ మ్యానరిజంలోనే ఈ మూవీ గురించి చెబుతూ.. అబ్బబ్బ.. ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. మహేష్ లాంటి హీరో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ ట్వీట్ చేస్తూ.. సరిలేరు చిత్రం అదిరిపోయిందని ట్వీట్ చేసింది.
కృష్ణ గారితో మాట్లాడాను..
మహేష్ బాబు సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ డే చూడటం కృష్ణకు సెంటిమెంట్. అలా సినిమా చూసి ఆయన తన అభిప్రాయాన్ని మహేష్‌కు చెబుతాడన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిలేరు నిర్మాత ట్వీట్ చేస్తూ.. కృష్ణ గారితో ఇప్పుడే మాట్లాడానని అనిల్ సుంకర తెలిపాడు.

ఆ సీన్లను మెచ్చుకున్నాడు..
ఆయన రియాక్షన్ ఏంటన్నది కూడా ట్వీట్ చేస్తూ.. సరిలేరు చిత్రంపై ఆనందంగా ఉన్నట్లు తెలిపాడు. సీతా రామరాజు సీన్లను అనిల్ రావిపూడి డీల్ చేసిన విధానం నచ్చినట్టు పేర్కొన్నాడు. మహేష్ డ్యాన్సులు, నటనను మెచ్చుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు సరిలేరును ప్రశంసిన కృష్ణకు నిర్మాత ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











