Telangana Elections 2023: మహేష్ బాబు దంపతులు ఎవరికి ఓటేశారో సింబాలిక్‌గా చూపించారుగా.. మీరూ గమనించారా!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హవా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతుండగా.. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ... పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఎలాంటి గొడవలు సృష్టించకుండా తమకు నచ్చిన వారికి ఓటు వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు ఓట్లు వేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి ఓటు వేశారు.
జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 165లో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇద్దరూ కలిసి వచ్చిన ఈ జంట.. క్యూలైన్ లో నిలబడి మరీ ఓటు వేశారు. అయితే ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన వీరి జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా వీళ్లు ఏ పార్టీకీ వేశారో సింబాలిక్ గా చూపించారు కదా అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. కావాలంటే ఈ వీడియోలు మీరూ చూడండి అంటూ చెప్పుకొస్తున్నారు.
Recommended Video


అయితే ఈ వీడియోల్లో ఏముందో.. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల జంట ఎవరికి ఓటేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఓటు వేసేందుకు వచ్చిన నమ్రత శిరోద్కర్ పింక్ కలర్ టీషర్టు వేసుకుంది. ఈ టీషర్టులో ఆమెను చూసిన ప్రతీ ఒక్కరూ వాళ్లు బీఆర్ఎస్ కు ఓటేశారని అంటున్నారు. దాన్ని సింబాలిక్ గా చూపించడానికి ఆమె ఈ కలర్ టీషర్ట్ వేసుకుందంటూ వివరిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా తాము కూడా కారుకే ఓటేస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలిసిన వాళ్లు కనిపిస్తే చేయి ఊపినందుకు ఆయన కాంగ్రెస్ కు ఓటేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు చేసే ఏ చిన్న హింట్ ను అయినా నెటిజెన్లు ఇట్టే పట్టేస్తారు. కానీ కావాలని చేశారు, కాజ్యువల్ గా చేశారా అనేది పక్కన పెడితే దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేసేస్తుంటారు. మీరూ ఓసారి వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూసేయండి. మీకేమనిపించిందో కామెంట్లు రూపంలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications











