హ్యాపీ బర్త్ డే మహేష్‌బాబు: ఎక్కడ.. ఎవరితో సెలబ్రేట్ చేసుకోబోతున్నారో తెలుసా?

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మహర్షి విజయం తర్వాత విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం తెలిసిందే. ఓ వైపున సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటూనే మరోవైపు తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. ఆగస్టు 8 తేదీ సాయంత్రం వరకు షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రిన్స్.. తన బర్త్ డే రోజున కేవలం ఫ్యామిలీతో గడుపబోతున్నారు. భార్య నమత్ర, కుమారుడు గౌతమ్, కూతురు సితారతో ఓ ప్రైవేట్ ప్రదేశానికి వెళ్తున్నట్టు సమాచారం.

Super Star Mahesh Babu celebrating birthday on August 9

ఇటీవలే 25 సినిమాలు పూర్తి చేసుకొన్న మహేష్ బాబు.. ఎప్పుడూ ఫ్యామిలీ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారనేది సినీ వర్గాల్లో టాక్. ఈసారి కూడా ఫ్యామిలీకే ప్రాధాన్యం ఇస్తూ తన జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారని సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

తన కెరీర్‌లో 25వ చిత్రంగా రూపుదిద్దుకొన్న మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. సుమారు రూ.200 కోట్లకు చేరువైంది. ఈ విజయం తర్వాత సక్సెస్ రేసులో దూసుకెళ్తున్న F2 దర్శకుడు అనిల్ రావిపూడితో జతకట్టారు. రష్మిక మందన్న మహేష్‌కు జోడిగా నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X